దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పావు శాతం పెంచటం గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో పెట్టుబడిదారులు అలర్ట్‌గా వ్యవహరించారు. దీంతో ఎర్లీ ట్రేడింగ్ స్వల్ప లాభాల్లోనే జరిగింది. ఇంట్రాడేలో మాత్రం పుంజుకుంది. సెన్సెక్స్ 555 పాయింట్లు పెరిగి 61 వేల 749 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
నిఫ్టీ 165 పాయింట్లు పెరిగి 18 వేల 255 పాయింట్ల పైనే ఎండ్ అయింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్ ర్యాలీ తీశాయి.
రంగాల వారీగా చూసుకుంటే.. నిఫ్టీ మెటల్ మరియు నిఫ్టీ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌లు బాగా లాభపడ్డాయి. అంటే.. సున్నా పాయింట్ ఏడు శాతం వరకు పెరిగాయి. మరో వైపు నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ సున్నా పాయింట్ 5 శాతం వరకు నష్టపోయింది. వ్యక్తిగత షేర్ల విషయానికొస్తే.. ఏబీబీ ఇండియా స్టాక్స్ వ్యాల్యూ 4 శాతం పెరిగి సరికొత్త విలువకు చేరుకుంది. టైటాన్ స్టాక్స్ ఒక శాతానికి పైగా రాణించాయి.
పది గ్రాముల బంగారం ధర 317 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 61 వేల 282 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు 591 పెరిగింది. గరిష్టంగా 75 వేల 991 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర నామమాత్రంగా 29 రూపాయలు మాత్రమే పెరిగింది. ఒక బ్యారెల్ ముడి చమురు 5 వేల 676 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 9 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే 81 రూపాయల 72 పైసల వద్ద స్థిరపడింది.