Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ మొదలైంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోమన్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1గా భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి)తదితర విభిన్న చిత్రాల దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి నిర్మాతలుగా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘సతీ లీలావతి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సోమవారం ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాలు రామోజీ ఫిల్మ్ సిటీలోని సంఘి హౌస్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, చిత్ర సమర్పకులు జెమినీ కిరణ్, నిర్మాతలు హరీష్ పెద్ది, వి.ఆనంద ప్రసాద్, అన్నే రవి, డైరెక్టర్ తాతినేని సత్య తండ్రి, సీనియర్ డైరెక్టర్ టి.ఎల్.వి.ప్రసాద్ సహా పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు పాల్గొన్నారు.
Krishna Vamsi: ‘పుష్ప 2’ మూవీ పై ఇన్‌డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Also Read
- Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత హరీష్ పెద్ది క్లాప్ కొట్టారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా,సీనియర్ డైరెక్టర్ టి.ఎల్.వి.ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు తాతినేని సత్య ‘‘ఆహ్లాదాన్ని కలిగించే చక్కటి ఎంటర్‌టైనర్‌గా ‘సతీ లీలావతి’ రూపొందుతుంది. మనస్ఫూర్తిగా నవ్వుకునే రొమాంటిక్ డ్రామాగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలతో సినిమా తెరకెక్కుతుంది. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జోడీ ఫ్రెష్ లుక్‌తో మెప్పించనున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ఈరోజు నుంచే ప్రారంభిస్తున్నామన్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ఈరోజు నుంచే ప్రారంభిస్తున్నాం. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!