దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం కూడా నష్టాలతో ముగిసింది. గత వారం అంతర్జాతీయ పరిస్థితులు కారణంగా మార్కెట్‌లో ఒడుదుడుకులు ఏర్పడి సూచీలు నష్టాలను చవిచూశాయి. వారం ముగింపులో మాత్రం లాభాలతో ముగిసింది. అదే దూకుడు ఈ వారం కూడా ఉంటుందని భావించారు. అంతేకాకుండా గ్లోబుల్ మార్కెట్‌లో సానుకూల సంకేతాలు కలిసొస్తాయని ఆర్థిక నిపుణులు భావించారు కానీ.. ఈ వారం ప్రారంభంలో కూడా నష్టాలతోనే ముగిసింది. సెన్సెక్స్ 73 పాయింట్లు నష్టపోయి 81, 151 దగ్గర ముగియగా.. నిఫ్టీ 72 పాయింట్లు నష్టపోయి 24, 781 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 84.07 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Salman Khan: సల్మాన్ ఖాన్ కృష్ణ జింక కేసులో మాజీ ప్రేయసి సంచలన వ్యాఖ్యలు
ఇక నిఫ్టీలో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బీపీసీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్‌లు అత్యధికంగా నష్టపోగా… హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్ లాభపడ్డాయి. ఆటో మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ మరియు మీడియా 1-2 శాతం క్షీణించడంతో ఎరుపు రంగులో ముగిశాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1 శాతం చొప్పున క్షీణించాయి.
ఇది కూడా చదవండి: Minister Atchannaidu: మూలపేట పోర్టు నిర్మాణ పనులు పునఃప్రారంభం