Salman Khan: సల్మాన్ ఖాన్ కృష్ణ జింక కేసులో మాజీ ప్రేయసి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లారెన్స్ బిష్ణోయ్ నుండి వచ్చిన హత్య బెదిరింపుల కారణంగా సల్మాన్ ఖాన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. దానికి తోడు బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ భద్రతను పెంచారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు నటి, సల్మాన్ మాజీ ప్రియురాలి సోమీ అలీ లారెన్స్ బిష్ణోయ్ అలాగే సల్మాన్ గురించి చాలా విషయాలు వెల్లడించారు. సోమి మాట్లాడుతూ, ‘నేను అప్పట్లో అవుట్‌డోర్ షూటింగ్‌కి వెళ్లేదానిని, కానీ ఈ సంఘటన జరిగినప్పుడు నేను అవుట్‌డోర్ షూటింగ్‌కి వెళ్లలేదు. అప్పట్లో సల్మాన్‌కి వేట అంటే చాలా ఇష్టం. ఆయనతో వెళ్ళినపుడు నేను జంతువులని చూసి దగ్గేదానిని వెంటనే అవి పారిపోయేవి, ఎందుకంటే నాకు వేట అంటే ఇష్టం లేదు అని ఆమె అన్నారు.
Actress Shabrin: మేనమామతో ప్రేమాయణం.. మేనల్లుడి కిడ్నాప్ కేసులో నటి అరెస్ట్
Also Read
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
ఈ షూటింగ్ సమయంలో సల్మాన్ నన్ను తనతో తీసుకెళ్లలేదు, నేను నిన్ను వేటకు తీసుకెళ్ళను, లేకుంటే నీ వల్ల అవి పారిపోతున్నాయని సల్మాన్ చెప్పుకొచ్చాడని ఆమె అన్నారు. ఇక బిష్ణోయ్ కమ్యూనిటీలో కృష్ణజింకలను పూజిస్తారన్న విషయం సల్మాన్‌కు తెలియదని, అందుకే క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని సోమీ పేర్కొన్నారు. తనకు తెలియని విషయానికి సల్మాన్ ఎందుకు క్షమాపణలు చెప్పాలి? తెలిసీ తెలియక ఏదో చేసినట్టు, బలవంతంగా క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు అని ఆమె అన్నారు. సల్మాన్ చాలా అహంకారి కానీ మంచి పేరు తెచ్చుకున్నాడని అంటున్నారు. ఈ రోజు నాకు అతనితో లేదా అతని కుటుంబంతో ఎటువంటి సంబంధం లేదు. బాలీవుడ్‌లోనో, హాలీవుడ్‌లోనో ఎవరినీ హత్య చేయడం నాకు ఇష్టం లేదు, హింస ఎప్పుడూ పరిష్కారం కాదని అన్నారు.
సోమి అలీ మాట్లాడుతూ.. వేట జరిగిన ప్రదేశం 80 ఎకరాల్లో విస్తరించి ఉందని, అందుకే సల్మాన్ ఖాన్ మాత్రమే వేటకు వెళ్లారని, మరెవరూ అక్కడికి వెళ్లలేదని అన్నారు. అయితే సల్మాన్ స్టార్ కాబట్టి టార్గెట్ చేస్తున్నారు. కానీ చాలా మంది ప్రజలు వేటాడేందుకు ఆ ప్రదేశానికి వస్తారు. ఇప్పటివరకు ఇంకెవరూ కృష్ణ జింకను వేటాడలేదా? అని ఆమె పశ్నించారు. బిష్ణోయ్ కమ్యూనిటీ కృష్ణ జింకలను పూజిస్తారనే విషయం సల్మాన్‌కు తెలియదని అన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు సల్మాన్ తనతో కూడా మాట్లాడాడని సోమి అలీ వెల్లడించారు. బిష్ణోయ్ కమ్యూనిటీ కృష్ణ జింకను ఆరాధిస్తారనే విషయం తనకు తెలియదని సల్మాన్ ఖాన్ తనతో చెప్పినట్లు సోమీ తర్వాత వెల్లడించారు. సల్మాన్‌కి కృష్ణ జింకను ఆరాధిస్తారనే విషయం తెలియదని బిష్ణోయ్ వర్గీయులు అర్థం చేసుకోవాలని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!