Stock Market Crash: బ్లాక్ మండే.. స్టాక్ మార్కెట్లో భారీ విధ్వంసం.. రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ పతనాన్ని చవిచూడడంతో ఈ రోజు బ్లాక్ మండేగా మారిపోయింది.. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లలో కొద్దిసేపటికి పరిస్థితి మారిపోయింది.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ భారీ నష్టాల్లోకి జారుకోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. మధ్యాహ్నం 1 గంట సమయానికి సెన్సెక్స్ రోజు గరిష్ఠ స్థాయి నుంచి ఏకంగా 1,800 పాయింట్లు పడిపోయింది. ఈ పతనంతో పెట్టుబడిదారుల సంపదలో దాదాపు రూ.5 లక్షల కోట్లు ఆవిరయ్యాయి.
లాభాలతో ప్రారంభమై.. భారీ నష్టాల్లోకి మార్కెట్లు
సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్ఈ 30 షేర్ల సెన్సెక్స్ గత ముగింపు 83,919 పాయింట్లతో పోలిస్తే లాభాల్లో 84,421 వద్ద ప్రారంభమైంది. కొద్దిసేపటికే 743 పాయింట్లు పెరిగి 84,662 స్థాయికి చేరుకుంది. అయితే ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీ క్రమంగా పతనమైంది. మధ్యాహ్నం 1 గంట సమయానికి రోజు గరిష్ఠ స్థాయి నుంచి 1,800 పాయింట్లు కోల్పోయి 82,862 స్థాయికి దిగజారింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా ఇదే బాటలో పయనించింది. గత ముగింపు 25,800 పాయింట్లతో పోలిస్తే 25,929 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. తొలుత 25,992 స్థాయికి చేరుకున్నప్పటికీ, ఆ తర్వాత భారీగా పడిపోయింది. మధ్యాహ్నం సమయానికి రోజు గరిష్ఠ స్థాయి నుంచి 525 పాయింట్లకు పైగా నష్టపోయి 25,467 వద్ద ట్రేడయింది.
Also Read
- Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
- Gold and Silver Prices: వరుస పతనానికి బ్రేక్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..?
- Gold Rates Down: బంగారం ధరలు భారీగా పతనం.. మోడీకి థాంక్స్ చెప్పిన సీటీఐ..
- Gold Loan Recovery: గోల్డ్ లోన్ తీసుకున్న వారికి షాక్.. గండం ముంచుకొస్తోంది!
ఇన్వెస్టర్లకు రూ.5 లక్షల కోట్ల నష్టం
దేశీయ మార్కెట్ల పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైపోయింది.. బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ గత శుక్రవారం సుమారు రూ.515 లక్షల కోట్లుగా ఉండగా, సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయానికి రూ.510 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఒక్కరోజులోనే దాదాపు రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరైనట్లయింది. ఈ పరిణామం స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఇక, మార్కెట్ పతనంలో బ్యాంకింగ్ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్ఈ లార్జ్‌క్యాప్ విభాగంలో టాటా స్టీల్ షేరు సుమారు 9 శాతం నష్టపోయింది. యాక్సిస్ బ్యాంక్ 3.30 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.50 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.40 శాతం, ఎస్బీఐ 2.20 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.18 శాతం నష్టాలతో ట్రేడయ్యాయి. మిడ్‌క్యాప్ విభాగంలో ఏపీఎల్ అపోలో షేరు ఏకంగా 20 శాతం పడిపోగా, హిందుస్థాన్ పెట్రోలియం 3 శాతం నష్టపోయింది. స్మాల్‌క్యాప్ విభాగంలో ఎస్టీఎల్ టెక్ 5 శాతం, హెచ్ఎఫ్సీఎల్ 4.99 శాతం నష్టాలతో ట్రేడయ్యాయి.
ఇన్వెస్టర్లలో పెరిగిన ఆందోళన
అయితే, ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కొద్ది గంటల్లోనే భారీ నష్టాల్లోకి జారుకోవడం ఇన్వెస్టర్లను కలవరపరిచింది. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్ పతనానికి తోడైంది. మొత్తంగా సోమవారం స్టాక్ మార్కెట్లకు బ్లాక్ మండేగా మారింది. అయితే ఈ గణాంకాలన్నీ మధ్యాహ్నం 1 గంట సమయానికి నమోదైన ట్రేడింగ్ వివరాలు మాత్రమే. ఆ తర్వాత మళ్లీ మార్కెట్ పుంజుకుంటుందా..? నష్టాల్లోనే కొనసాగుతుందా? అనేది చూడాలి..
తాజావార్తలు
-
Stock Market Crash: బ్లాక్ మండే.. స్టాక్ మార్కెట్లో భారీ విధ్వంసం.. రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి..!
-
Komatireddy Venkat Reddy: 100 సీట్లు గెలుస్తాం.. మళ్లీ అధికారంలోకి వస్తాం!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Janasena vs Janasena: పిఠాపురం జనసేనలో అసమ్మతి సెగలు.. వైస్ చైర్మన్ పదవి రచ్చ.. ఎంపీ పీఏపై దాడి..!
-
Faisal Malik : ‘రామాయణ’ టీం మొత్తానికి షాకిచ్చిన కుంభకర్ణుడు
ట్రెండింగ్
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..