JSW Steel : ఉక్కు రంగ దిగ్గజం జేఎస్ డబ్ల్యూ స్టీల్ ఒడిశాలో రూ.65 వేల కోట్ల పెట్టుబడితో భారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పారాదీప్‌లో ప్లాంట్‌కు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
Steel Pricing: ఈ ఆర్థిక సంవత్సరంలో స్టీల్‌కి గిరాకీ 90 లక్షల టన్నులు పెరగనుందని, తద్వారా మొత్తం పదకొండున్నర కోట్ల టన్నులకు చేరనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఒక టన్ను ఉక్కు ధర 55 వేల నుంచి 57 వేల రూపాయల వరకు ఉంది. అంతర్జాతీయంగా స్టీల్ ఉత్పత్తి 6.2 కోట్ల టన్నులు తగ్గినప్పటికీ ఇండియాలో డిమాండ్ బాగుండటం ఈ సెక్టార్‌కి ప్లస్ పాయింట్‌గా మారిందని నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.