Sri Lanka: అదానీ సంస్థకు షాక్.. విద్యుత్ ఒప్పందాన్ని సమీక్షిస్తామన్న కొత్త ప్రభుత్వం
- అదానీ గ్రూప్‌కు షాక్
- విద్యుత్ ఒప్పందాన్ని సమీక్షిస్తామన్న శ్రీలంక కొత్త ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదానీ గ్రూప్‌కు శ్రీలంక కొత్త ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అదానీ గ్రూప్ చేపట్టబోయే ప్రాజెక్టులపై పున:సమీక్ష జరుపుతామని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అదానీ గ్రూప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలేటట్టు కనిపిస్తోంది. గత ప్రభుత్వం ఆమోదించిన అదానీ గ్రూప్ పవన విద్యుత్ ఒప్పందాన్ని సమీక్షిస్తామని శ్రీలంక కొత్త ప్రభుత్వం తెలిపింది. విదేశాంగ మంత్రి విజితా హెరాత్ మాట్లాడుతూ.. అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు విద్యుత్ ధరలను గత ప్రభుత్వం ఆమోదించడం సమస్యగా ఉందని అన్నారు. నవంబర్ 14న పార్లమెంటు ఎన్నికలు జరిగిన తర్వాత కొత్త ప్రభుత్వం ఈ ఒప్పందానికి సరికొత్త రూపాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు.
ఇది కూడా చదవండి: Vijayawada: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. ఉరేసుకుని భార్య సూసైడ్
Also Read
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్‌లో నయా ట్రెండ్
- Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
- HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
అదానీ గ్రీన్ డీల్‌ను తిరిగి సమీక్షిస్తామని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకే గతంలోనే ప్రతిజ్ఞ చేశారు. గత నెలలో దిసనాయకే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదానీ ప్రాజెక్ట్ ఇంధన సార్వభౌమత్వానికి ముప్పు అని దిసానాయకే పేర్కొన్నారు. దానిని రద్దు చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. అయితే పార్లమెంటరీ ఎన్నికలకు ముందు భారీ ప్రాజెక్టులపై ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోబోమని విదేశాంగ మంత్రి విజితా హెరాత్ మంగళవారం చెప్పారు. దిసనాయకే విజయం సాధించినప్పటికీ, శ్రీలంకలోని 225 సీట్ల శాసనసభలో అతని కూటమికి కేవలం మూడు సీట్లు మాత్రమే ఉన్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi: నవరాత్రి సమయంలో హర్యానాలో విక్టరీ సాధించడం శుభసూచకం
శ్రీలంకలో రెండు పవన ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని అదానీ గ్రూప్ ప్రతిపాదించింది. ఒకటి మన్నార్‌లో, రెండవది పూనేరిన్‌లో. రెండూ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్నాయి. మన్నార్ ప్రాజెక్ట్ వన్యప్రాణులకు ముప్పుపై పర్యావరణ సమూహాల నుంచి కోర్టు సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే కొత్త ప్రభుత్వం ఇబ్బందులు తలపెట్టే పరిస్థితి ఏర్పడడంతో అదానీ గ్రూప్‌కు పెద్ద దెబ్బ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తు్న్నాయి.
ఇది కూడా చదవండి: Bengaluru Murder Case: ఆత్మరక్షణ కోసం చంపేశా.. డెత్ నోట్‌లో రాసుకున్న నిందితుడు
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!