దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఫ్లాట్‌గా ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల సంకేతాలు కారణంగా ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా అలాగే ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 4 పాయింట్లు నష్టపోయి 82, 555 దగ్గర ముగియగా.. నిఫ్టీ ఒక పాయింట్ లాభంతో 25, 279 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.96 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: BRS vs Congress: ఖమ్మంలో ఉద్రిక్తత.. హరీష్ రావు కారుపై రాళ్ల దాడి
నిఫ్టీలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్‌లు లాభపడగా.. ఒఎన్‌జీసీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి. సెక్టార్లలో బ్యాంక్ మరియు క్యాపిటల్ గూడ్స్ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం పెరగగా.. మీడియా, పవర్, మెటల్, రియాల్టీ మరియు ఆయిల్ & గ్యాస్ 0.5-1.5 శాతం క్షీణించాయి. బీఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ స్వల్ప లాభాలతో ముగియగా… స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగింది.
ఇది కూడా చదవండి: France: దారుణం.. భార్యను 72 మందితో అత్యాచారం చేయించిన దుర్మార్గపు భర్త..