TG SET 2024 : లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అవసరమైన తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష టీజీ సెట్ 2024 ఫలితాలను ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగారంతో కలిసి ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. పరీక్షకు మొత్తం 33వేల 494 మంది దరఖాస్తు చేసుకోగా 26వేల 294 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో 1884 మంది అర్హత సాధించారు. పరీక్షకు హాజరైన వారిలో 7.17శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత…
స్త్రీలు గౌరవింపబడినప్పుడే దేశం బాగుంటుందని పెద్దలు అంటుంటారు. అక్షరాల అది నిజం చేశారు లండన్ ప్రజలు. శుక్రవారం వెలువడిన యూకే ఎన్నికల ఫలితాల్లో నారీమణులు అత్యధిక స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. తాజా ఫలితాల్లో సరికొత్త రికార్డును నెలకొల్పారు.
మహిళా అభ్యర్థులు పరీక్ష రాయాలంటే తాళిబొట్టు, మెట్టెలు తీసేయాలని నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారంపై మహిళా అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల పేరుతో సంప్రదాయాలను కించపరుస్తున్నారని ఫైర్ అవుతున్నారు. దీనిపై టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి వివరణ ఇచ్చారు. పరీక్షకు హాజరయ్యే మహిళలు తాళిబొట్టు, మెట్టెలు తీసేయాలని రూల్స్ లేదని ఆయన చెప్పారు.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగం బ్యాకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది.. గర్భిణీ ఉద్యోగుల విషయంలో ఎస్బీఐ కొత్తగా జీరా చేసిన సర్క్యులర్‌పై వివాదం మొదలైంది.. దీనిపై స్పందించిన ఉమెన్ కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది.. ఇక, వ్యవహారంపై రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ కూడా రాశారు.. అయితే, అన్ని రకాల నుంచి వివాదులు చుట్టుముట్టడంతో.. ఎస్బీఐ దిగొచ్చింది.…