తన ఖాతాదారులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. జీరో బ్యాలెన్స్ ఖాతా కలిగినవారి నుంచి వచ్చే జులై 1వ తేదీ నుంచి కొత్త సర్వీసు రుసుములు వసూలు చేసేందుకు రెడీ అవుతోంది.. క్యాస్ విత్‌డ్రాస్, చెక్‌బుక్‌పై పరిమితులు విధించింది.. ఎస్బీఐ విధించిన తాజా పరిమితి దాటితే చార్జీలు వడ్డింపు తప్పదన్నమాట.. ఇక, ఎస్బీఐ శాఖలో గానీ, ఏటీఎంలో గానీ మొత్తం నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా క్యాష్ విత్ డ్రాయల్‌కు అనుమతి ఉంటుంది.. పరిమితి దాటితే.. ప్రతి ఆపరేషన్‌పై రూ.15లతో పాటు జీఎస్టీ అదనంగా వసూలు చేయనుంది.. ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసినా ఇదే తరహా ఛార్జీలు వడ్డించనున్నారు. మొత్తంగా.. ఎస్బీఐ కానీ, ఇతర ఏటీఎంలు గానీ.. నాలుగు సార్లు మాత్రమే ఉచిత సర్వీసు ఉంటుంది.
మరోవైపు.. 10 చెక్‌లతో కూడిన చెక్‌బుక్‌ను ఖాతాదారులకు ఉచితంగా అందిస్తోంది ఎస్బీఐ.. అంతకంటే, ఎక్కువ లీవ్స్ గల చెక్ బుక్ కావాలంటే అదనంగా సమర్పించుకోవాల్సి ఉంటుంది.. 10 చెక్స్ కలిగిన బుక్ కు రూ.40లతోపాటు అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.. ఒకవేళ 25 చెక్స్ ఉన్న బుక్ కావాలంటే రూ.75, అత్యవసరంగా చెక్ బుక్ కావాలంటే 10 చెక్స్ ఉన్న బుక్ కు రూ.50+జీఎస్టీ చెల్లించాలి. అయితే, తన ఖాతాదారులైన సీనియర్ సిటిజన్లకు మాత్రం చెక్ బుక్ ఛార్జీలు ఉండబోవు అంటోంది ఎస్బీఐ. మొత్తంగా.. జులై 1వ తేదీ నుంచి ఎస్బీఐ ఖాతాదారులకు కొత్త చెల్లింపులు మోత మోగించనున్నాయి..