Residential Property: విశాఖ, విజయవాడ సహా ఈ నగరాల్లో ఇళ్లకు ఫుల్ డిమాండ్.. 94 శాతం పెరిగిన ధరలు..!
- భారతదేశంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు పెరిగిన డిమాండ్..
- 94 శాతం వరకు పెరిగిన ధరలు..
- ఇళ్లు.. ఫ్లాట్లకు అధిక గిరాకీయే కారణం..! ఉద్యోగ మార్కెట్
- బలమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా ఇళ్లకు గిరాకీ..
- స్థిరాస్తి డేటా అనలిటిక్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ నివేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Residential Property: ఇళ్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అన్నారు పెద్దలు.. అంటే.. మనిషి జీవితంలో ఈ రెండింటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది.. అంతేకాదు.. ఇల్లు కట్టడం, పెళ్లి చేయటం రెండూ ఖర్చుతో కూడుకున్నవే.. అనుకున్నదానికంటే ఒకటికి మూడింతలు ఖర్చు అవుతుంది.. మరోవైపు గృహమే కదా స్వర్గసీమ అని కూడా అన్నారు.. అయితే, తమ ఆర్థిక స్థోమతు బట్టి.. ఇళ్లను తమకు నచ్చిన విధంగా నిర్మించుకోవడం.. ఒకటైతే.. ఇప్పుడు కట్టిన ఇళ్లను కొనుగోలు చేయడం బాగా పెరిగిపోయింది.. బ్యాంకులు హౌసింగ్ లోన్లు ఇస్తుండంతో.. క్రమంగా ఇళ్లు కొనే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.. 2023-24తో ముగిసే గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరలు 94 శాతం వరకు పెరిగాయి.. నివాసాలకు అధిక గిరాకీయే ఇందుకు కారణమని.. ఉద్యోగ మార్కెట్ మరియు బలమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా ఇళ్లకు మంచి గిరాకీ పెరిగిందని స్థిరాస్తి డేటా అనలిటిక్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ పేర్కొంది.
Read Also: Telangana: 50 రోజుల్లో 900కి పైగా వాహనాలు సీజ్.. రూ.8.72 కోట్లు ఫైన్
Also Read
- Milky Mist Founder: 16 ఏళ్లకే చదువు మానేసి పనీర్ అమ్ముతూ.. రూ.10 వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు! ఎవరీ సతీష్ కుమార్?
- KCC Loan: రైతులకు గుడ్‌న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
- PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
- EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్‌డ్రాయల్, నామినేషన్‌పై ప్రభావం
ఆ సంస్థ.. 2023-24లో సగటు ఇళ్ల ప్రాజెక్టుల ప్రారంభ ధరను.. 2019-20 ధరలతో పోల్చి ఈ వివరాలను ప్రకటించింది. దేశంలో ప్రధానమైన 30 ద్వితీయశ్రేణి మార్కెట్లలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు లాంటి నగరాలు ఉండగా.. అమృత్సర్, మొహలి, లుధియానా, చండీగఢ్, పానీపట్, దెహ్రాడూన్, భివాండీ, సోనేపట్, జయపూర్, ఆగ్రా, లఖ్‌నవూ, భోపాల్, ఇందౌర్, మంగళూరు, మైసూర్, కోయంబత్తూర్, కోచి, త్రివేండ్రం, రాయపూర్, భువనేశ్వర్, అహ్మదాబాద్, గాంధీనగర్, వడోదరా, సూరత్, నాసిక్, నాగ్‌పూర్, గోవా కూడా ఈ జాబితాలో ఉన్నాయి.. ఇందులో 24 నగరాల్లో ఇళ్ల ధరలు రెండంకెల్లో పెరిగిపోతే.. 6 నగరాల్లో ధరలు ఒక అంకె వృద్ధి సాధించాయని పేర్కొంది.. ఇక, టాప్ 10 సిటీల్లో ఇళ్ల ధరలు 54 శాతం నుంచి 94 శాతం పెరిగాయని పేర్కొంది ప్రాప్‌ఈక్విటీ.
గోవాలో 90 శాతం, మంగళూరులో 56 శాతం మరియు ఇండోర్ లో 72 శాతం వరుసగా వెస్ట్, సౌత్ మరియు సెంట్రల్/ఈస్ట్ జోన్లలో అత్యధిక పెరుగుదలను నమోదు చేసినట్టు ఆ సంస్థ తెలిపింది.. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో కొత్త లాంచ్‌ల కంటే పాత వాటికి కూడా డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొంది. పెరిగిన డిమాండ్ కారణంగా ద్వితీయ శ్రేణి నగరాలు గణనీయమైన ధరల పెరుగుదలను చూశాయి. వినియోగదారుల్లో ఆసక్తి పెరగడం, కనెక్టివిటీలో ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు బలమైన జాబ్ మార్కెట్లు.. ఈ నగరాల్లో ఎక్కువ భాగం ధరలను రెండంకెలకు పెంచాయి అంటున్నారు ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు మరియు సీఈవో సమీర్ జసుజా..
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!