Bank strike : డబ్బు కావాలంటే త్వరపడండి.. ఆ రోజు బ్యాంకులు పనిచేయవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bank strike : మీకేమైనా అర్జెంట్ అయితే వెంటనే బ్యాంకుకు వెళ్లి సరిపడా డబ్బులు తెచ్చుకోండి. ఎందుకంటే బ్యాంకు అధికారులు సమ్మె చేపట్టబోతున్నారు. దీంతో ఈ నెల 19న బ్యాంకులు బంద్ కానున్నాయి. అసలు బ్యాంకు ఉద్యోగులు ఆ ఒక్క రోజు సమ్మె చేపడుతున్నారు. కారణం ఏంటంటే ఇటీవల బ్యాంకుల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు ఎక్కువయ్యాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెగ్యులర్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో నవంబర్ 19వ తేదీన బ్యాంకింగ్ ఉద్యోగుల సంఘం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల బంద్‌కు పిలుపునిచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవి కూడా ఈ శనివారం పని చేయవు. అయితే ప్రైవేటు బ్యాంకులు మాత్రం యధాతధంగా పని చేస్తాయి.
Read Also: Michelle Obama: అమెరికా అధ్యక్ష బరిలో ఒబామా భార్య.. క్లారిటీ ఇచ్చిన మిచెల్ ఒబామా
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాతాదారుల సొమ్ముకు విఘాతం కలగడమే కాదు.. ఈ విధానం వల్ల ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానంపై తమ ఆందోళన తెలియజేసేందుకు ఖాతాదారుల పక్షాన ఒక్క రోజు సమ్మెకు దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా, ఈ సమ్మెలో కిందస్థాయి ఉద్యోగులు మాత్రమే ఆందోళన చేపట్టనున్నారని.. ఉన్నతోద్యోగులు కాదని వెంకటాచలం ప్రకటించారు. సమ్మె రోజున క్యాష్ డిపాజిట్, విత్ డ్రా, చెక్ క్లియరెన్స్, ఏటీఎం సేవలను నిలిపివేయనున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!