Sanjay Malhotra: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
- పశ్చిమాసియాలో మరోసారి యుద్ధం తీవ్రం
- అంతర్జాతీయంగా మరో సంక్షోభం తలెత్తే సూచనలు
- యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధం తీవ్రం కావడంతో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా హెచ్చరికలు జారీ చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు దేశానికి సవాళ్లుగా మారే అవకాశం ఉందని సంజయ్ మల్హోత్రా వార్నింగ్ ఇచ్చారు. గురువారం ద్రవ్యోల్బణం, రూపాయి మారకపు విలువపై స్పందించిన ఆయన.. ప్రస్తుతం ద్రవ్యోల్బణం, రూపాయి రెండూ సాపేక్షంగా అనుకూల స్థితిలోనే ఉన్నాయని తెలిపారు. అయితే పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల ప్రభావాన్ని నిర్లక్ష్యం చేయలేమని అన్నారు.
ద్రవ్యోల్బణంపై మాట్లాడుతూ.. సరఫరా వ్యవస్థపై ఒత్తిళ్ల కారణంగా ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని మించే అవకాశం ఉందని.. అయినప్పటికీ ప్రస్తుతం ద్రవ్యోల్బణ పరిస్థితి సాపేక్షంగా మంచి స్థితిలోనే ఉందని అభిప్రాయపడ్డారు. రూపాయి మారకపు విలువపై స్పందిస్తూ.. భారత కరెన్సీ కూడా ప్రస్తుతం స్థిరమైన స్థితిలో కొనసాగుతోందని తెలిపారు. అయితే పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం, దానికి సంబంధించిన అనిశ్చితులు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశముందని హెచ్చరించారు. అంతర్జాతీయ పరిణామాలను ఆర్బీఐ నిరంతరం పర్యవేక్షిస్తోందని, అవసరమైన సమయంలో తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన పునాదులపై నిలిచి ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ పరిణామాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని గవర్నర్ సూచించారు.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. తాత్కాలిక శాంతి ఒప్పందం ముగియడంతో మళ్లీ దాడులు తీవ్రమయ్యాయి. పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా మరోసారి తీవ్ర సంక్షోభం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!