Bank Alert : ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ HDFC బ్యాంక్ తన ఖాతాదారులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. జూలై 3 రాత్రి నుంచి జూలై 4 వేకువజామున వరకు కొన్ని గంటల పాటు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. సర్వర్ నిర్వహణ పనుల కారణంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు బ్యాంక్ అధికారికంగా వెల్లడించింది.
బ్యాంక్ ప్రకారం.. జూలై 3వ తేదీ రాత్రి 11:45 గంటల నుంచి జూలై 4వ తేదీ ఉదయం 01:15 గంటల వరకు అంటే 90 నిమిషాల పాటు సేవలకు అంతరాయం కలుగుతుంది. ఈ సమయంలో UPI ద్వారా లావాదేవీలు చేయలేరు.
Dil Raju : నెగెటివ్ ట్రోలింగ్‌కు చెక్.. మంచు విష్ణు మార్గాన్ని ఫాలో అవుతున్న దిల్ రాజు”
ఈ పనులు ప్రధానంగా HDFC బ్యాంక్ సేవింగ్స్/కరెంట్ ఖాతా, RuPay డెబిట్ కార్డ్ ఆధారిత UPI లావాదేవీలపై ప్రభావం చూపనున్నాయి. అంతేకాదు, HDFC నెట్ బ్యాంకింగ్‌కు మద్దతు ఇచ్చే TPAP ప్లాట్‌ఫారాలు, వ్యాపారుల లావాదేవీలు కూడా తాత్కాలికంగా ప్రభావితమవుతాయి.
ఈ సమయంలో వినియోగదారులు తమ లావాదేవీల కోసం PayZapp వాలెట్ను ఉపయోగించాలని బ్యాంక్ సిఫార్సు చేస్తోంది. బ్యాంకింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ సర్వర్ అప్‌గ్రేడ్ నిర్వహించబడుతోంది. వినియోగదారుల ఇబ్బందిని తగ్గించేందుకు ముందస్తుగా మెయిల్, వెబ్‌సైట్ ద్వారా హెచ్చరిక జారీ చేయడం జరిగింది.
ఈ సమయాల్లో ముఖ్యమైన లావాదేవీలు ఉంటే ముందుగానే పూర్తి చేసుకోవాలని, లేదా పైన సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని HDFC బ్యాంక్ వినయపూర్వక విజ్ఞప్తి చేస్తోంది. సేవల పునరుద్ధరణ అనంతరం సాధారణంగా అన్ని సేవలు తిరిగి అందుబాటులోకి వస్తాయి.