No Trump Effect: రెండ్రోజుల వరుస నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ బయటపడింది. ఐటీ, ఫార్మా స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దుతు కలిసి రావడంతో ఏ ఎఫక్ట్ స్టాక్ మార్కెట్‌పై పని చేయలేదు. అసలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బాదుడును దేశీయ మార్కెట్ పెద్దగా పట్టించుకోనేలేదు. ఎందుకంటే ట్రేడ్‌డీల్‌లో పైచేయి సాధించడానికి సుంకాల బాదుడు ఒక ఎత్తుగడ అని మార్కెట్ గ్రహించిందని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు.
READ MORE: Hyderabad: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. వచ్చే రెండ్రోల పాటు విస్తారమైన వర్షాలు..!
ఇంట్రాడేలో కనిష్ఠాల నుంచి 800 పాయింట్ల మేర పైకి..
రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చమురును సాకుగా చూపి భారత్‌పై సుంకం వడ్డించడంతో మార్కెట్ సూచీలు స్టార్టింగ్‌లో పెద్ద మొత్తంలో నష్టాలు చవిచూసిన.. డే ఎండింగ్‌కి వచ్చే సరికి మాత్రం కొనుగోళ్ల మద్దతుతో గట్టిగా పుంజుకొని ఏ ఎఫెక్ట్ తమను ప్రభావితం చేయదని నిరూపించాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దుతు నష్టాల నుంచి గట్టెక్కించాయి. టారిఫ్ భయాలతో సెన్సెక్స్ ఉదయం 80,262.98 (క్రితం ముగింపు 80,543.99) పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఆరంభంలో భారీ నష్టాల్లో కొనసాగిన సూచీ.. ఇంట్రాడేలో 79,811.29 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో భారీగా పుంజుకుని 79.27 పాయింట్ల లాభంతో 80,623.26 వద్ద స్థిరపడింది. నిఫ్టీసైతం 21.95 పాయింట్ల లాభంతో 24,596.15 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 87.69గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎటెర్నల్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ లాభాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్, ట్రెంట్, టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్టీపీసీ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 67.30 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 3451 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ట్రంప్ బెదిరింపులను మార్కెట్ పెద్దగా పట్టించుకోలేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుంకాల బెదిరింపులు అనేవి భారత్‌ను దారికి తెచ్చుకోవడం, ట్రేడ్‌డీల్‌లో పైచేయి సాధించడానికి ట్రంప్ వేస్తున్న ఎత్తుగడ అని ఇప్పటికే మార్కెట్‌కు అర్థమైందని అంటున్నారు. త్వరలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరొచ్చన్న అంచనాలు ఉన్న కారణంగా మార్కెట్ దీనిపై ఎక్కువ ఆందోళన చెందలేదని అన్నారు. మార్కెట్ లాభాల్లో ముగియడానికి మరో కారణం ట్రెడర్స్‌కు మన ఎకానమీపై ఉన్న విశ్వాసం అని పేర్కొన్నారు.
READ MORE: Anchor Ravi : బిగ్ బాస్ కు వెళ్తే నాశనమే.. యాంకర్ రవి సంచలనం..