HDFC Q3 Results: 34 శాతం పెరిగి.. రూ. 16,373 కోట్లకు చేరుకున్న నికర లాభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2024 ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై24క్యూ3) మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఏడాది ప్రాతిపదికన (YoY) 34 శాతం పెరుగుదలతో రూ.16,373 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు కంపెనీ తెలిపింది. HDFC బ్యాంక్ నికర లాభం విశ్లేషకుల అంచనాల కంటే మెరుగ్గా ఉంది. LSEG డేటా ప్రకారం.. విశ్లేషకులు నికర లాభం రూ.15,651 కోట్లుగా అంచనా వేశారు.
గత త్రైమాసికంలో బ్యాంక్ స్టాండ్ అలోన్ నికర లాభం రూ.15,976 కోట్లు ఉంది. ఇదిలా ఉంటే.. ఎన్ పీఏ కూడా పెరిగింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు (జిఎన్‌పిఎ) డిసెంబర్ త్రైమాసికంలో 1.26 శాతానికి పెరిగింది. ఇది సెప్టెంబర్ త్రైమాసికంలో 1.34 శాతంగా ఉంది. గతేడాది ఇదే కాలంలో (ఎఫ్వై23క్యూ3) 1.23 శాతంగా ఉంది. బ్యాంక్ స్థూల NPA (NNPA) 0.31 శాతంగా ఉంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో 0.33 శాతంగా ఉంది.
Also Read
- Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
- Petrol and Diesel Price Hike: పెట్రోల్ ధరలపై షాకింగ్ న్యూస్.. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ హెచ్చరిక.. వడ్డీ రేట్లకూ రెక్కలు?
- India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
- Mobile Sales: అమ్మో.. స్మార్ట్ ఫోన్..! అంత పెట్టి కొనలేం బాబోయ్
NII పెరిగింది
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) ఏడాది ప్రాతిపదికన 24 శాతం పెరిగి రూ.28,471 కోట్లకు చేరుకుంది. గత త్రైమాసికంలో ఇది రూ.27,385 కోట్లు ఉంది. వార్షిక ప్రాతిపదికన (YoY) చూస్తే.. గత సంవత్సరం ఇదే కాలంలో బ్యాంక్ NII రూ. 22,990 కోట్లు ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ ఎన్ ఐఐ 24 శాతం పెరిగింది. బ్యాంక్ ఇతర ఆదాయం రూ.11,137 కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ.8,500 కోట్లు ఉంది.
స్వతంత్ర ప్రాతిపదికన ఆదాయం పెరిగింది
డిసెంబర్ త్రైమాసికంలో స్టాండలోన్ ప్రాతిపదికన బ్యాంకు మొత్తం ఆదాయం రూ.30,512 కోట్లు పెరిగి రూ.81,720 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.51,208 కోట్లుగా నమోదైంది. ఈ డిసెంబరు త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత మొత్తం ఆదాయం గతేడాది ఇదే కాలంలో రూ.54,123 కోట్లతో పోలిస్తే రూ.1,15,015 కోట్లకు పెరిగింది.
ఏకీకృత ప్రాతిపదికన బ్యాంకు నికర లాభం 39 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 12,735 కోట్లతో పోలిస్తే ఎఫ్వై24క్యూ3లో రూ.17,718 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
HDFC బ్యాంక్ లాభం ఎందుకు పెరిగింది?
రాయిటర్స్ నివేదిక ప్రకారం.. భారతీయ బ్యాంకులు గత కొన్ని నెలల్లో బలమైన పనితీరును నమోదు చేశాయి. ఎందుకంటే అప్పులు తీసుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది. బ్యాంకు రుణ వృద్ధిని రెండంకెల మేర పెంచింది. దీంతో పాటు.. పండుగల సీజన్ కారణంగా బ్యాంకులు మెరుగైన పనితీరును కనబరిచాయి. పండుగ సీజన్లో రిటైల్ రుణాలకు డిమాండ్ పెరుగుతుంది. ఇది బ్యాంకు వృద్ధిపై సానుకూల ప్రభావం చూపుతుంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు పెరిగాయి
ఫలితాలు వెలువడక ముందే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. జనవరి 16న దీని షేర్లు బిఎస్ఇలో 0.42 శాతం పెరిగాయి. బ్యాంక్ షేర్లు రూ.1678.95 వద్ద ముగిశాయి.
తాజావార్తలు
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
-
Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
-
Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!