భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2024 ఆర్థిక సంవత్సరం (ఎఫ్‌వై24క్యూ3) మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఏడాది ప్రాతిపదికన (YoY) 34 శాతం పెరుగుదలతో రూ.16,373 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు కంపెనీ తెలిపింది. HDFC బ్యాంక్ నికర లాభం విశ్లేషకుల అంచనాల కంటే మెరుగ్గా ఉంది. LSEG డేటా ప్రకారం.. విశ్లేషకులు నికర లాభం రూ.15,651 కోట్లుగా అంచనా వేశారు.