వంటింట్లో గ్యాస్ ధర మంట పెడుతోంది… ఇప్పటికే ఆన్‌టైం హై రికార్డులను తాకిన ఎల్పీజీ సిలిండర్ ధర.. మరోసారి పెరిగింది.. వంట గ్యాస్ ధర 50 రూపాయలు పెంచేశారు.. ఇప్పటికే దేశంలో పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో సిలిండర్ ధరల పెంపు సామాన్యుల కష్టాలను మరింత పెంచుతుంది. తాజా పెంపుతో.. తెలంగాణలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,052కి చేరింది.
Read Also: Gold Price: పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన ధర
ఇక, చెన్నైలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. రూ.965గా ఉండగా.. తాజాగా చమురు కంపెనీలు 50 రూపాయలు పెంచడంతో తమిళనాడులో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,015కు పెరిగింది.. మరోవైపు, ఈ నెల ప్రారంభంలో, వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచారు. మే 1న, 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 102.50 పెరిగి, రూ.2355.50కి, అలాగే 5 కిలోల ఎల్‌పీజీ కమర్షియల్ సిలిండర్ ధరను రూ.655కి పెంచారు. ఇక, వరుసగా పెట్రో, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో.. సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.