డబ్బులను సేవ్ చెయ్యాలనుకొనేవారికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అందిస్తుంది.. అందులో ఎల్ఐసి ఎన్నో కొత్త పథకాలను అందిస్తుంది.. ఎటువంటి రిస్క్ లేకుండా తక్కువ పెట్టుబడితో ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తుంది.. ఎల్ఐసీలో కొన్ని పాలసీలు మంచి రాబడి ఇచ్చేవి ఉన్నాయి. ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటున్నారు. కరోనాకు ముందు పాలసీల గురించి పెద్దగా పట్టించుకోని జనాలు ఇప్పుడు అదే పనిగా ఎటువంటి పథకాలలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయా అని తెలుసుకొని మరీ డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారు..
ఇక ఎల్ఐసి కూడా సరికొత్త పథకాలను అందిస్తుంది.. ఎల్ఐసీ నుంచి మరో అద్భుతమైన పాలసీ ఉంది. అదే జీవన్ లాభ్ పాలసీ. ఈ పాలసీలో భాగంగా మీరు ప్రతి నెలా 7,572 మాత్రమే ఆదా చేసుకుని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీనితో, మీరు మెచ్యూరిటీపై 54 లక్షల భారీ ఫండ్ పొందుతారు. ఇది LIC యొక్క పరిమిత ప్రీమియం, నాన్ లింక్డ్ పాలసీ. అదే సమయంలో, పాలసీదారు మరణిస్తే కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. అలాగే, పాలసీదారు మెచ్యూరిటీ వరకు జీవించి ఉంటే, అతను భారీ మొత్తంలో డబ్బులను పొందుతాడు..
ఈ పాలసీని తీసుకోవాలని భావించేవారికి ఖచ్చితంగా 18 ఏళ్ల నుంచి 54 ఏళ్ల వయసు ఉండాలి..ఈ పాలసీ కింద, బీమా హోల్డర్లు 10, 13 మరియు 16 సంవత్సరాల వరకు డబ్బును డిపాజిట్ చేయవచ్చు, ఇది 16 నుండి 25 సంవత్సరాల మెచ్యూరిటీపై డబ్బు ఇవ్వబడుతుంది. 59 ఏళ్ల వ్యక్తి 16 ఏళ్లపాటు బీమా పాలసీని ఎంచుకోవచ్చు, తద్వారా అతని వయస్సు 75 ఏళ్లు మించకూడదు. ఇది కాకుండా, పాలసీ వ్యవధిలో ఏదైనా కారణం వల్ల పాలసీదారు మరణిస్తే, నామినీ దాని ప్రయోజనాన్ని పొందుతాడు. బోనస్‌తో పాటు, బీమా కంపెనీ నామినీకి హామీ ఇచ్చిన మొత్తం లాభాలను కూడా పొందవచ్చు.. ప్రమాదవ శాత్తు వ్యక్తి మరణిస్తే మీకు డబ్బులు కూడా ఎక్కువగా వస్తాయి.. ఆసక్తి ఉంటే ఈ పాలసీలను తీసుకోండి..