10 వేల నోట్లు మీరు ఎప్పుడైనా చూశారా? ఇండియాలో 10 వేల నోట్లు ఉండేవని కనీసం పెద్దలైనా ఎప్పుడైనా గుర్తుచేశారా? ఎవరు చెప్పలేదా? ఆ ఊసే ఎప్పుడు వినబడలేదా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
ప్రస్తుతం నగదు దగ్గర ఉంచుకునే వాళ్ల సంఖ్య తగ్గింది. ప్రతిదీ ఆన్లైన్ మయంగా మారింది. డిజిటల్ చెల్లింపు విధానం విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారు. చిరువ్యాపారి నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్థుల వరకు అందరూ వాటిపైనే ఆధారపడుతున్నారు.