Oil Crisis: చమురు సెగ.. రోజుకు రూ.2 వేల కోట్ల నష్టం.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
- పెట్రోల్‌పై లీటరుకు రూ.20 నష్టం
- డీజిల్‌పై లీటరుకు ఏకంగా రూ.45 నష్టం
- మొత్తం నష్టంలో సింహభాగం డీజిల్ అమ్మకాల ద్వారానే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oil Crisis: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో భారతీయ చమురు కంపెనీలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. చమురు ధరల పెరుగుదల దేశీయ చమురు సంస్థలను కోలుకోలేని దెబ్బ తీస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు సరఫరా గొలుసును దెబ్బతీయడమే కాకుండా, దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగేలా చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ (IOC), BPCL, HPCL వంటి కంపెనీలు పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై రోజుకు సుమారు రూ.2,000 కోట్ల భారీ నష్టాన్ని చవిచూస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
READ ALSO: Fuel Gases: LPG, CNG, PNG మధ్య తేడాలు ఏంటి.. వీటిని ఏ విధంగా ఉపయోగిస్తారు..?
Also Read
- Smartphone Price Hike: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ‘షాక్’.. విపరీతంగా పెరుగుతున్న మొబైల్ ధరలు.. కారణం ఇదే!
- Campa Cola vs Coca-Cola: 'కోలా వార్'లో కొత్త మలుపు.. అంబానీ 'క్యాంపా' దెబ్బకు కోక్, పెప్సీ షాక్! ఫ్రీగా రిఫ్రిజిరేటర్లు..
- Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్.. రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరి
- Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!
ఖరీదైన దిగుమతులు.. పెరిగిన రవాణా ఖర్చులు
పెట్రోల్‌పై లీటరుకు రూ.20 నష్టం, డీజిల్‌పై లీటరుకు ఏకంగా రూ.45 నష్టం. ఈ మొత్తం నష్టంలో సింహభాగం (సుమారు రూ.1,650 కోట్లు) డీజిల్ అమ్మకాల ద్వారానే వస్తుండటం గమనార్హం. భారతదేశం తన చమురు అవసరాల కోసం 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. గత 15 రోజుల్లోనే ముడి చమురు ధరలు 30% కంటే ఎక్కువ పెరిగాయి. దీనికి తోడు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వల్ల చమురు ట్యాంకర్ల బీమా ప్రీమియంలు, సరుకు రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. గతంలో తక్కువ ధరకు లభించిన రష్యా ముడి చమురు, ఇప్పుడు బ్రెంట్ ధరల కంటే బ్యారెల్‌కు $2 నుంచి $8 వరకు అదనపు ప్రీమియంతో లభిస్తోంది. ఖతార్ నుంచి సరఫరా అంతరాయాల వల్ల స్పాట్ LNG ధరలు కేవలం నెల రోజుల్లోనే 50% పెరిగాయి.
ప్రస్తుతానికి చమురు కంపెనీలు నష్టాలను భరిస్తూ ధరలను స్థిరంగా ఉంచినప్పటికీ, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇదే రీతిన కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం మినహా మరో మార్గం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా సామాన్యుడికి భారంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
-
Smartphone Price Hike: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ‘షాక్’.. విపరీతంగా పెరుగుతున్న మొబైల్ ధరలు.. కారణం ఇదే!
-
UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
-
Terrorist Digital Plan: భారత్ టార్గెట్‌గా టెర్రరిస్టుల కొత్త ‘డిజిటల్’ ప్లాన్.. నిఘా వర్గాలకు అంతుచిక్కని మిస్టరీ!
-
Red Necked Nightjar : చందమామతో టైమ్ సెట్ చేసుకునే పక్షి.. ఇదే ప్రకృతి మ్యాజిక్.!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!