Delimitation bill: ఇండియా కూటమికి షాక్.. డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీ సపోర్ట్..
- ఇండియా కూటమికి శరద్ పవార్ షాక్..
- డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధం.?
- అన్ని రాష్ట్రాల్లో 50 శాతం పెంపు ఉంటే మద్దతిస్తామన్న సుప్రియా సూలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delimitation bill: ఈ వర్షాకాల సమావేశాల్లో ఎన్డీయే సర్కార్ మరోసారి నియోజకవర్గాల పునర్విభజన బిల్లు(డీలిమిటేషన్ బిల్లు)ను తీసుకురావాలని చూస్తోంది. అయితే, ఈ నేపథ్యంలో బీజేపీకి అనూహ్య మద్దతు లభించినట్లు తెలుస్తోంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ బిల్లుకు మద్దతు తెలిపే అవకాశం ఉంది. అయితే, దేశంలో జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపు హామీ బిల్లులో స్పష్టంగా ఉంటేనే బిల్లుకు మద్దతు ఇస్తామని ఆ పార్టీ సంకేతాలు ఇచ్చింది. ఇదే నిజమైతే ఇప్పటి వరకు డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ వస్తున్న ఇండియా కూటమికి భారీ షాక్ అని చెప్పొచ్చు. ఇప్పటికే డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు శరద్ పవార్ పార్టీ కూడా ఎన్డీయేకు మద్దతు తెలిపేందుకు సిద్ధమైంది.
ఈ పరిణామాలకు ముందు ఎన్సీపీలోని శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో రహస్యంగా భేటీ నిర్వహించినట్లు తెలుస్తోంది. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియాసూలే మాట్లాడుతూ.. ఈ ఊహాగానాలను ధ్రువీకరించడానికి నిరాకరించారు. ‘‘ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య 50 శాతం పెంచి, దానిని అమలును స్పష్టం చేస్తే మేము మద్దతు ఇస్తాము’’ అని అన్నారు. ఏప్రిల్‌లో లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం లోక్‌సభ స్థానాలు పెంచేలా బిల్లును సవరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దీంతో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని చెప్పారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
లోక్‌సభలో సభ్యుల సంఖ్య 850కి పెంచడం, మహిళా రిజర్వేషన్ అమలుకు మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఏప్రిల్‌లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు-2026ను కేంద్రం తీసుకువచ్చింది. అయితే మూడింట రెండొంతుల మెజారిటీ సాధించలేకపోవడంతో బిల్లు వీగిపోయింది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం మాట్లాడుతూ.. బీజేపీ శరద్ పవార్, డీఎంకే మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రస్తుత డీలిమిటేషన్ విధానం అమలైతే జనాభా నియంత్రణ సాధించిన రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. జూలై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం నేపథ్యంలో మరోసారి డీలిమిటేషన్ బిల్లు చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!