Fake Property Sale: ఒక్క ప్రాపర్టీనే 25 మందికి అమ్మేశారు.. వీరి మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి గురుగ్రామ్ ఒక స్వర్గధామంలా కనిపిస్తుంది. కానీ, తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ భారీ కుంభకోణం ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కళ్లు చెదిరే లాభాలు, గ్యారెంటీ అద్దెలు అంటూ ఆశ చూపి ఒకే ఆస్తిని పదుల సంఖ్యలో వ్యక్తులకు విక్రయించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన వైనం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ రికార్డులు, డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయని నమ్మించి చేసిన ఈ మాయాజాలం రియల్ ఎస్టేట్ పారదర్శకతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. దాదాపు రూ.500 కోట్ల విలువైన ఈ స్కామ్, కేవలం సామాన్యులనే కాకుండా బడా ఇన్వెస్టర్లను సైతం నివ్వెరపోయేలా చేసింది. గురుగ్రామ్‌లోని అత్యంత ఖరీదైన కమర్షియల్ ప్రాజెక్టులలో ఒకటైన ’32nd Avenue’ వేదికగా ఈ భారీ మోసం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ప్రమోటర్ , సీఈఓ ధ్రువ్ దత్ శర్మ ఫిబ్రవరి 2026లో పోలీసులకు చిక్కడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
మోసం చేసిన తీరు ఇదే..
Also Read
- Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
- LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
- EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!
- SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
నిందితుడు అత్యంత చాకచక్యంగా 3,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఒక కమర్షియల్ ఫ్లోర్‌ను ఎంపిక చేసుకున్నాడు. 2021 నుంచి 2023 మధ్య కాలంలో అదే స్థలాన్ని ఏకంగా 25 మంది వేర్వేరు వ్యక్తులకు విక్రయించాడు. ప్రతి కొనుగోలుదారుడికి నకిలీ అగ్రిమెంట్లు, తప్పుడు వివరాలతో కూడిన పత్రాలను సృష్టించి ఇచ్చాడు. నెలవారీ అద్దె ఇస్తామని నమ్మించి కొనుగోలుదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. 2025 ఆగస్టు వరకు అద్దెలు చెల్లించి నమ్మకం కలిగించి, ఆపై హఠాత్తుగా చేతులెత్తేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
Also Read:Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!
బాధితులందరి వద్ద పేమెంట్ రిసిప్టులు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి. అయినా వారికి ఆస్తి దక్కకపోవడానికి కారణం ‘ప్రియారిటీ ఆఫ్ రిజిస్ట్రేషన్’. చట్ట ప్రకారం.. ఒకే ఆస్తిని పదే పదే విక్రయించినప్పుడు, అందరికంటే ముందుగా (ఫస్ట్ ఇన్ టైమ్) ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వారికే చట్టబద్ధమైన హక్కులు లభిస్తాయి. మిగిలిన వారు తమ సొమ్మును రికవరీ చేసుకోవడానికి క్రిమినల్ కేసులు వేయాల్సి ఉంటుంది తప్ప, ఆస్తిపై వారికి యాజమాన్య హక్కులు ఉండవు.
కొనేముందు ఈ 7 పత్రాలు తప్పనిసరి సరి చూసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే మదర్ డీడ్, సేల్ డీడ్, ఎన్‌కాంబ్రాన్స్ సర్టిఫికెట్ (EC), మ్యుటేషన్ రికార్డ్స్, ప్రాపర్టీ ట్యాక్స్ రికార్డ్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (OC), రేరా (RERA) రిజిస్ట్రేషన్ కచ్చితంగా ఉండాలి. కేవలం రిజిస్ట్రేషన్ పత్రం చూడటమే కాకుండా, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో సదరు ఆస్తిపై గతంలో ఏవైనా లావాదేవీలు జరిగాయా అని ‘సెర్చ్ రిపోర్ట్’ తీసుకోవడం అత్యంత ముఖ్యం.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!