దేశ వ్యాప్తంగా నిత్యవసర ధరలు మండిపోతున్నాయి. బియ్యం, నూనె, పప్పులు.. ఇలా ఒక్కటేంటి అన్ని ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారి కోసం కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్ బ్రాండ్‌పై తక్కువ ధరకే గోధుమ పిండి, బియ్యం విక్రయాలను పునః ప్రారంభించింది. దీనికి సంబంధించిన రెండో దశను మంగళవారం ప్రారంభించింది. నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, కేంద్రీయ భండార్, ఈ-కామర్స్ సంస్థల ద్వారా ఈ విక్రయాలు చేపట్టనున్నట్లు తెలిపింది. ధరల భారం నుంచి ఉపశమనం కల్పించేందుకు తాత్కాలికంగా ఈ విక్రయాలు చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
ఇది కూడా చదవండి: Somy Ali: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య కాదు, హత్య.. సల్మాన్ ఖాన్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ సంచలనం..
దేశ వ్యాప్తంగా 3.69 లక్షల టన్నుల గోధుమలు, 2.91 లక్షల టన్నులు బియ్యాన్ని ఎఫ్‌సీఐ నుంచి సేకరించినట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు. కేటాయించిన స్టాక్ పూర్తయ్యే వరకు విక్రయాలు కొనసాగుతాయన్నారు. అవసరమైతే అదనపు కేటాయింపులు జరుపుతామని మంత్రి తెలిపారు. గోధుమ పిండిని కిలో రూ.30కే విక్రయిస్తామని.. ఇవి 5, 10 కేజీల ప్యాకెట్స్‌లో లభిస్తాయని చెప్పారు. ఇక కిలో బియ్యం రూ.34 చొప్పున విక్రయించనున్నారు. 5, 10 కేజీల ప్యాకెట్ల రూపంలో బియ్యం లభించనున్నాయి.
ఇది కూడా చదవండి: Equatorial Guinea: సెక్స్ స్కామ్‌లో చిక్కుకున్న ఈక్వటోరియల్ గినియా ఆఫీసర్.. వైరల్ వీడియోల్లో ఎవరెవరున్నారంటే..!