E20 Ethanol Blending: E20 పెట్రోల్‌పై అపోహలకు కేంద్రం చెక్.. ఇంజిన్‌కు ఎలాంటి నష్టం లేదు, 10 అంశాలతో వివరణ
- E20 పెట్రోల్‌పై అపోహలకు కేంద్రం చెక్
- 10 అంశాలతో వివరణ
- నీటి వినియోగం, మైలేజ్, వారంటీ, పర్యావరణ ప్రభావం వరకు వస్తున్న అనేక వాదనలను ఖండించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో E20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు ప్రచారాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పందించింది. పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ శుక్రవారం 10 అంశాలతో కూడిన వివరణ విడుదల చేస్తూ, E20 ఇంధనం వల్ల ఇంజిన్ దెబ్బతింటుందనే ప్రచారం నుంచి నీటి వినియోగం, మైలేజ్, వారంటీ, పర్యావరణ ప్రభావం వరకు వస్తున్న అనేక వాదనలను ఖండించింది. ప్రభుత్వం ప్రకారం, పెట్రోల్‌లో గరిష్టంగా 20 శాతం ఇథనాల్ కలిపే E20 కార్యక్రమం శాస్త్రీయ పరిశోధనలు, నియంత్రణ సంస్థల అనుమతులు, అంతర్జాతీయ అనుభవాల ఆధారంగా అమలు అవుతోంది.
E20పై కేంద్రం ఇచ్చిన 10 కీలక వివరణలు
1. ఒక లీటర్ ఇథనాల్‌కు 10,000 లీటర్ల నీరు అవసరం కాదు
ఒక లీటర్ ఎథనాల్ తయారీకి 10,000 లీటర్ల నీరు అవసరమని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కేంద్రం తెలిపింది. ఇథనాల్ తయారీకి దేశ ఆహార భద్రత అవసరాలు తీరిన తర్వాత మిగిలిన బియ్యాన్ని మాత్రమే ఉపయోగిస్తున్నామని పేర్కొంది. డిస్టిలరీల్లో ఒక లీటర్ ఇథనాల్ తయారీకి సుమారు 3 నుంచి 5 లీటర్ల ప్రాసెస్ చేసిన నీరు మాత్రమే ఉపయోగిస్తున్నారని తెలిపింది. అనేక ప్లాంట్లు Zero Liquid Discharge (ZLD) విధానంతో నీటిని రీసైకిల్ చేస్తున్నాయని వివరించింది.
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
- Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
- Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు... క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
2. E20 కొత్త ప్రయోగం కాదు
E20 ఇంధనం ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారని వస్తున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. అమెరికా, బ్రెజిల్, కెనడా, థాయ్‌లాండ్, జపాన్, పలు యూరోపియన్ దేశాల్లో ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.
3. మైలేజ్‌పై స్వల్ప ప్రభావమే
ARAI నిర్వహించిన పరీక్షల్లో కార్లతో సుమారు 40,000 కిలోమీటర్లు, ద్విచక్ర వాహనాలతో 20,000 కిలోమీటర్లు పరీక్షలు నిర్వహించగా, వాహన పనితీరు లేదా డ్రైవబిలిటీలో ఎలాంటి పెద్ద మార్పులు కనిపించలేదని వెల్లడించింది. మైలేజ్‌లో స్వల్ప మార్పులు మాత్రమే నమోదయ్యాయని తెలిపింది.
4. ఇంజిన్‌కు ఎలాంటి నష్టం లేదు
E20 వల్ల ఇంజిన్ లేదా మెటల్, ప్లాస్టిక్ భాగాలు దెబ్బతింటాయనే వాదనలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ARAI, ఇండియన్ ఆయిల్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, SIAM నిర్వహించిన అధ్యయనాల్లో ఇలాంటి సమస్యలు కనిపించలేదని పేర్కొంది. అయితే, చాలా పాత వాహనాల్లోని కొన్ని రబ్బర్ భాగాలను సాధారణం కంటే కొంచెం ముందుగానే మార్చాల్సి రావచ్చని తెలిపింది.
5. వారంటీ, ఇన్సూరెన్స్‌పై ప్రభావం లేదు
E20కు అనుకూలంగా రూపొందించిన వాహనాల్లో ఈ ఇంధనం ఉపయోగిస్తే కంపెనీ వారంటీ రద్దు కాదు. ఇన్సూరెన్స్ కూడా చెల్లుబాటులోనే ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
6. చీమలు, తేనెటీగలు ఆకర్షితమవుతాయనే ప్రచారం తప్పు
E20లో చక్కెర ఉండటంతో చీమలు, తేనెటీగలు వస్తాయనే సోషల్ మీడియా పోస్టులు అవాస్తవమని తెలిపింది. ఫ్యూయల్ గ్రేడ్ ఇథనాల్‌లో చక్కెర అవశేషాలు పూర్తిగా తొలగిస్తారని, అందులో ఉండే ప్రత్యేక రసాయనాలు కీటకాలను దూరంగా ఉంచుతాయని పేర్కొంది.
7. E20 కార్యక్రమం ప్రయోగం కాదని స్పష్టం
సుప్రీంకోర్టులో ప్రభుత్వం E20ను ప్రయోగమని పేర్కొన్నట్లు వచ్చిన వార్తలను కూడా కేంద్రం ఖండించింది. ఆ విచారణ ఇథనాల్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించినదేనని, E20 అమలుపై కాదని వివరించింది.
8. ఇంధన ట్యాంకులోకి నీరు చేరదు
E20 నీటిని ఎక్కువగా పీల్చుకుంటుందని, అది ఇంధన ట్యాంకులోకి చేరుతుందని వస్తున్న ప్రచారం తప్పని ప్రభుత్వం తెలిపింది. ఆధునిక వాహనాలు, పెట్రోల్ బంకుల మౌలిక సదుపాయాల్లో ఇందుకు అవసరమైన రక్షణ వ్యవస్థలు ఇప్పటికే ఉన్నాయని వెల్లడించింది.
9. చెరకు రసం కలుపుతున్న వీడియోలు నకిలీవే
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న “చెరకు రసాన్ని పెట్రోల్‌లో కలుపుతున్నారు” అనే వీడియోలు పూర్తిగా నకిలీవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంధన ఇథనాల్ పారిశ్రామిక ప్రక్రియల ద్వారా తయారవుతుందని, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే పెట్రోల్‌లో కలుపుతారని పేర్కొంది.
10. పర్యావరణానికి మేలు
E20 కార్యక్రమం వల్ల దేశానికి పలు ప్రయోజనాలు లభించాయని కేంద్రం తెలిపింది. రూ. 1.9 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆదా, రైతులకు రూ.1.6 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు, సుమారు 930 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల తగ్గింపు, 310 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతుల తగ్గింపు వంటి ప్రయోజనాలు సాధించినట్లు వెల్లడించింది.
E20 లక్ష్యాన్ని ముందుగానే సాధించిన భారత్
కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, 2025 డిసెంబర్లోనే భారత్ 20 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ లక్ష్యాన్ని చేరుకుంది. 2013-14లో కేవలం 1.5 శాతం ఉన్న ఇథనాల్ మిశ్రమం, ఇప్పుడు 20 శాతానికి చేరుకోవడం విశేషమని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో సుమారు 2,000 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులో ఉండగా, 2025-26 సరఫరా సంవత్సరంలో 1,200 కోట్ల లీటర్లకు పైగా ఇథనాల్ కొనుగోలు జరిగే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజావార్తలు
-
Bihar: అందరికి డయాబెటిస్ ఉంది, చక్కెర ధర పెరిగిన పర్వాలేదు: బీహార్ మంత్రి..
-
Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు వైద్య పరీక్షలు పూర్తి.. తిరిగి జైలుకు తరలింపు
-
Suji Chilla Pizza Recipe: పిండికి బదులుగా బొంబాయి రవ్వతో కరకరలాడే పిజ్జా.. ఇంట్లోనే నిమిషాల్లో రెడీ!
-
BJP: రాహుల్ గాంధీ డ్రామాలు వీడియోల కోసమే.. బీజేపీ నేతల విమర్శలు..
-
Tarique Rahman: శాంతించిన తారిఖ్ రెహమాన్.. ఎల్లుండి భారత్‌లో పర్యటన!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!