Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిహార్ ప్రభుత్వం సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు , ఇన్ఫ్లుయెన్సర్ల కోసం ఒక సరికొత్త ఆదాయ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో అమలువుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులు, ప్రభుత్వ విజయాలపై వీడియోలు చేసే క్రియేటర్లకు ఆర్థిక ప్రోత్సాహకం అందించేలా ‘సోషల్ మీడియా అండ్ అదర్ ఆన్లైన్ మీడియా రూల్స్’ సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డిజిటల్ మీడియా ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.
ఈ కొత్త విధానం ప్రకారం.. ఒక వీడియో పోస్ట్ చేసిన 30 రోజుల వ్యవధి పూర్తయిన తర్వాత వచ్చే ప్రతి 1 లక్ష వ్యూస్‌కు క్రియేటర్లకు అదనంగా రూ.10,000 చొప్పున చెల్లిస్తారు. ఒకే వీడియోకు ఇచ్చే గరిష్ట పరిహారం రూ. 1 లక్ష వరకు ఉంటుంది. ఉదాహరణకు, ఒక వీడియో కనీసం 10 లక్షల అర్హత కలిగిన వ్యూస్ సాధిస్తే సదరు క్రియేటర్ గరిష్టంగా రూ.10,000 చొప్పున లెక్కించి రూ. 1 లక్ష పొందే అవకాశం ఉంటుంది.
Also Read
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
అయితే వైరల్ అయిన ప్రతి వీడియోకు ఈ డబ్బులు నేరుగా అందవు. కంటెంట్ కేవలం ప్రభుత్వ పథకాలు, ప్రజా సంక్షేమ అంశాలపైనే ఉండాలి. అలాగే సదరు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లేదా ఇతర సోషల్ మీడియా ఖాతాల ఫాలోవర్లు, పేజీల ప్రామాణికతను ప్రభుత్వం ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంది. వ్యూస్ నిజమైనవేనా లేదా అనే దానిపై వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది.
సమాచార , పౌర సంబంధాల శాఖ (IPRD) త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏయే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను అనుమతిస్తారు, వ్యూస్ ఎలా లెక్కిస్తారు, క్రియేటర్లు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎంపానెల్మెంట్ నిబంధనలు ఏంటి అనేది ఆ నోటిఫికేషన్లో స్పష్టత రానుంది. ప్రాంతీయ భాషల్లో వీడియోలు చేసే బీహార్ డిజిటల్ క్రియేటర్లకు ఇది మంచి ఆదాయ వనరుగా మారడమే కాకుండా.. సాంప్రదాయ మీడియాను చూడని గ్రామీణ ప్రజలకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారం సులభంగా చేరడానికి ఉపయోగపడుతుంది.
తాజావార్తలు
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!