E20 Petrol: దేశవ్యాప్తంగా 20% ఇథనాల్ కలిగిన E20 పెట్రోల్ వాహన యజమానులకు తలనొప్పిగా మారుతోంది. ప్రభుత్వం దీనిని గ్రీన్ ఎనర్జీ వైపు చారిత్రాత్మక అడుగుగా అభివర్ణిస్తుండగా.. సాధారణ ప్రజలు మాత్రం దీన్ని తిరస్కరిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఓ సర్వే ప్రకారం.. ఈ కొత్త మిశ్రమ ఇంధనం వాహన మైలేజీని తగ్గించి ఖర్చులను పెంచిందని చెబుతున్నారు.
E20 Fuel Policy: భారతదేశంలో గత కొద్దీ రోజులుగా E20 ఫ్యూయల్ (20% ఎథనాల్ మిశ్రమం ఉన్న పెట్రోల్)పై చర్చ తీవ్రతరమైంది. సోషల్ మీడియాలో అనేకమంది కారు వినియోగదారులు తమ వాహనాల్లో మైలేజ్ గణనీయంగా తగ్గిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు, సస్టెయినబిలిటీ లక్ష్యాలను చేరుకోవడానికై కేంద్ర ప్రభుత్వం 2023 ఏప్రిల్‌లో E20 ఫ్యూయల్‌ను ప్రవేశపెట్టింది. కానీ, పాత వాహనాలు ఈ ఫ్యూయల్‌కి అనుకూలం కాకపోవడంతో కొన్ని కార్ల వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.…