Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
- కండోమ్ కంపెనీకి కాసుల వర్షం
- ఐదేళ్లలో 12,000 శాతానికిపైగా రిటర్న్స్
- ప్రమోటర్ కొనుగోళ్లతో దూకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టాక్ మార్కెట్ ఎప్పుడు.. ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఒక్కరోజు ఒక్కోలా ఉంటుంది. కొన్ని షేర్లు పెట్టుబడిదారులకు ఊహించని స్థాయిలో రాబడులను అందిస్తుంటాయి. అలాంటి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో క్యుపిడ్ (Cupid) షేర్ కూడా ఒకటిగా నిలిచింది. కండోమ్ తయారీ సంస్థ క్యుపిడ్ షేర్ ధర గత కొంతకాలంగా భారీగా పెరుగుతోంది. కంపెనీ ప్రమోటర్ అదిత్య కుమార్ హల్వాసియా తన వాటాను పెంచుకోవడంతో ఈ షేర్ మరోసారి ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. కేవలం ఐదేళ్లలోనే ఈ స్టాక్ దాదాపు 12,150 శాతం రాబడిని అందించింది.
ప్రమోటర్ వాటా పెంపు
క్యుపిడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అదిత్య కుమార్ హల్వాసియా రెండు విడతల్లో కంపెనీ షేర్లను కొనుగోలు చేశారు. స్టాక్ ఎక్స్ఛేంజ్కు కంపెనీ ఇచ్చిన సమాచార ప్రకారం.. ఆగస్టు 17న ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 13,95,538 క్యుపిడ్ షేర్లను కొనుగోలు చేశారు. ఇవి కంపెనీలో 0.10 శాతం వాటాకు సమానం. అదే విధంగా ఆగస్టు 18న మరో 8,03,000 షేర్లను.. అంటే 0.06 శాతం వాటాను కొనుగోలు చేశారు. ఈ కొనుగోళ్లతో కంపెనీలో అదిత్య కుమార్ హల్వాసియా వ్యక్తిగత వాటా 33.45 శాతానికి పెరిగింది. ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ కలిపి క్యుపిడ్లో మొత్తం వాటా 46.40 శాతంగా ఉంది.
Also Read
- Stock Market Crash: నాలుగు రోజుల్లో రూ.20 లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తున్న ఐదు కారణాలు ఇవే..
- EPFO Rules: పదవీ విరమణ తర్వాత PF డబ్బు వెంటనే తీసుకోవాలా? EPFO ఏం చెబుతోంది?
- PM Kisan: పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.. ఆ రోజే డబ్బులు ఖాతాల్లోకి జమ..
- Reliance Jio IPO: కోటి దరఖాస్తులతో జియో సరికొత్త చరిత్ర..
ఒక్క నెలలోనే 36 శాతం పెరిగిన షేర్
ప్రమోటర్ వాటా పెంచుకోవడంతో క్యుపిడ్ షేర్‌పై ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగింది. గత ఒక్క నెలలోనే ఈ షేర్ ధర 36 శాతానికి పైగా పెరిగింది. గత వారం ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ స్థాయిని కూడా తాకింది. గురువారం క్యుపిడ్ షేర్ ఇంట్రాడేలో రూ.286.80 దగ్గర గరిష్ఠాన్ని తాకింది. ఇది గత ముగింపు ధరతో పోలిస్తే దాదాపు 0.9 శాతం పెరుగుదల. అయితే వరుసగా రెండు రోజుల ర్యాలీ తర్వాత అధిక స్థాయిల దగ్గర ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో షేర్ ధర కొంత వెనక్కి వచ్చింది.
5 ఏళ్లలో 12,000 శాతానికిపైగా రిటర్న్స్
క్యుపిడ్ షేర్ దీర్ఘకాలికంగా అద్భుతమైన రాబడులను అందించింది. 2026 ఆగస్టు 14న ఈ షేర్ బీఎస్ఈలో రూ.298.95 దగ్గర 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. గత మూడు నెలల్లో క్యుపిడ్ షేర్ 137 శాతం పెరిగింది. ఆరు నెలల్లో ఏకంగా 233 శాతం ఎగబాకింది. ఏడాది కాలంలో దాదాపు 750 శాతం పెరిగింది. ఇక మూడు సంవత్సరాల్లో ఈ స్టాక్ 8,742 శాతం రాబడిని అందించింది. అత్యంత ఆశ్చర్యకరంగా.. గత ఐదేళ్లలో క్యుపిడ్ షేర్ ధర దాదాపు 12,150 శాతం పెరిగింది. అంటే ఈ కాలంలో ఈ షేర్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించినట్లైంది.
ప్రస్తుతం షేర్ ధర ఎంత?
మధ్యాహ్నం 1:25 గంటల సమయంలో క్యుపిడ్ షేర్ బీఎస్ఈలో 0.70 శాతం నష్టంతో రూ.282.30 దగ్గర ట్రేడ్ అయింది. ప్రమోటర్ వరుస కొనుగోళ్లు, భారీ గతకాలపు రాబడుల నేపథ్యంలో ఈ స్టాక్ మరోసారి మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
-
Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
-
Viral : స్టంప్ మైక్‌లో రికార్డైన తిలక్, నితీష్ తెలుగు ముచ్చట్లు.. తెలుగు కుర్రాళ్ల మాటలు లీక్
-
Bhatti Vikramarka : తెలంగాణకు సూపర్ ఎల్ నినో ముప్పు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక విజ్ఞప్తి
-
Meerut Blue Drum Case: హైకోర్టుకు ముస్కాన్, సాహిల్.. ఉరిశిక్షపై అప్పీల్.!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!