Today Gold and Silver Rates in Hyderabad: బంగారం కొనాలనుకుంటున్నారా?.. అయితే మీకో శుభవార్త. వరుసగా మూడో రోజు బంగారం ధర పడిపోయింది. అంతకుముందు రికార్డు బంగారం ధర ఆల్ టైం హైకి చేరిన సంగతి తెలిసిందే. వరుసగా పెరిగిన పసిడి ధర ఇప్పుడు కాస్త దిగొస్తుంది. అంతర్జాతీయంగా, దేశీయంగా 3 రోజుల్లో భారీగానే తగ్గింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (జూన్ 23) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,450గా ఉంది.
నిన్నటితో (జూన్ 22) పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 200 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 220 తగ్గింది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలలో ప్రతిరోజు మార్పులు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పసిడి ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,600గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,450గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,850లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,830 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,500లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,450లుగా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,450 వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,450గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,500 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,450గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,450 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు బంగారం బాటలోనే వెండి ధరలు కూడా నడిచాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 72,000లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 1000 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 72000లుగా ఉండగా.. చెన్నైలో రూ. 75000లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72000గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 75,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 75,000ల వద్ద కొనసాగుతోంది.
Also Read: Titan Submarine: టైటాన్ ఆచూకీ లభ్యం.. అమెరికన్ కోస్ట్ గార్డ్ వెల్లడి
Also Read: Takkar : సిద్దార్థ్ టక్కర్ ఓటీటీ విడుదల ఎప్పుడో తెలుసా…?