మగువులకు గుడ్‌న్యూస్. శుక్రవారం బంగారం ధరలు దిగొచ్చాయి. రోజుకో రీతిగా బంగారం ధరలు ఉంటున్నాయి. ఒకరోజు పెరిగిపోతుంటే.. ఇంకోరోజు దిగొస్తున్నాయి. ఇలా బంగారం ధరలు హెచ్చుతగ్గులు అవుతున్నాయి. శుక్రవారం తులం గోల్డ్ ధరపై రూ.550 తగ్గగా.. సిల్వర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు.
ఇది కూడా చదవండి: Russia: విషాదం.. రష్యాలో అదృశ్యమైన భారతీయ మెడికల్ విద్యార్థి మృతదేహం లభ్యం
బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 తగ్గి.. రూ.1,22,020 దగ్గర అమ్ముడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.500 తగ్గి.. రూ.1, 11, 850 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.410 తగ్గి.. రూ.91, 520 దగ్గర అమ్ముడవుతోంది.
ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,52,500 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,65,000గా కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో మాత్రం రూ.1, 52, 500 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Prashant Kishor: 14న నేను చెప్పిందే నిజమవుతుంది.. పోలింగ్‌పై ప్రశాంత్ కిషోర్ జోస్యం