Gold Rates: పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బులియన్ మార్కెట్లో బుధవారం నాడు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.47,350కి చేరింది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగి రూ.51,660గా ఉంది. అటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ.4,200 పెరిగి రూ.66,700కి చేరింది. ఏపీ, తెలంగాణలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Read Also: Capcicum: క్యాప్సికంతో అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820గా నమోదైంది. అటు తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100గా పలుకుతోంది. బెంగళూరులో రూ.51,710గా, ఆర్ధిక రాజధాని ముంబైలో రూ.51,660గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర ఢిల్లీలో రూ.47,500, చెన్నైలో రూ.47,750, బెంగళూరులో రూ.47,400, ముంబైలో రూ.47,350గా పలుకుతోంది.