ఎర్ర క్యాప్సికంలో లైకోపీన్ అనే ఫైటోన్యూట్రియెంట్ ఉంటుంది. ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
క్యాప్సికంలో ఉండే ఫోలేట్, విటమిన్ B6, యాంటీ ఆక్సిడెంట్లు.. ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తాయి.
జీవక్రియను పెంచడానికి ట్రైగ్లిజరైడ్‌లను క్యాప్సికం తగ్గిస్తుంది. క్యాప్సికమ్ తింటే.. కొవ్వు కరిగి, బరువు తగ్గుతారు.
క్యాప్సికంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ న్యూట్రీషియన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నందున.. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
క్యాప్సికంలోని విటమిన్ సి ఆర్థరైటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
క్యాప్సికంలో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది వెన్నుముక నొప్పిని నివారిస్తుందని నమ్ముతారు.
ఐరన్ లోపంతో బాధపడేవారికి.. క్యాప్సికం ఎంతగానో ఉపయోగపడుతుంది.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, పొడవాటి మెరిసే జుట్టును అందించడానికి క్యాప్సికం తోడ్పడుతుంది.