ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం అదిరిపోయే స్కీమ్ లను అందిస్తున్నారు.. అందులో అమ్మాయిల కోసం కూడా మంచి స్కీమ్ లను అందిస్తున్నారు.. అమ్మయి పుడితే కుటుంబాలకు ఆర్థిక మద్దతు ఆఫర్ చేస్తోంది. అమ్మాయిల భవిష్యత్‌కు భరోసా ఇచ్చేలా వారి పేరుపై డబ్బులు డిపాజిట్ చేస్తోంది ప్రభుత్వం.. భారత దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆ స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి.. కేంద్ర ప్రభుత్వం కూడా స్పెషల్ స్కీమ్ అందిస్తోంది. మనం వీటిల్లో ఇప్పుడు ఒక పథకం గురించి తెలుసుకోబోతున్నాం. దీని ద్వారా అమ్మాయి పుడితే రూ. 21 వేలు లభిస్తాయి. ఈ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్ లలో ఆప్‌కీ బేటి, హమరీ బేటి అనే స్కీమ్ ఒకటి అందుబాటులో ఉంది. ఈ స్కీమ్‌ను హరియాణ ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం 2015లోనే ప్రారంభం అయ్యింది. ఈ స్కీమ్ కింద అమ్మాయి పుడితే.. ప్రభుత్వం రూ. 21 వేలు అంస్తుంది. బాలబాలికల మధ్య లింగ నిష్పత్తి వ్యత్యాసాన్ని తగ్గించడం, భ్రూణ హత్యలు వంటి నేరాలను నిరోధించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.. ప్రభుత్వ భీమా సంస్థ ఎల్ఐసీ తో ఈ స్కీమ్ ను రూపోందిస్తున్నారు.. పుట్టిన పాప పేరుపై రూ. 21 వేల మొత్తాన్ని ప్రభుత్వం ఎల్ఐసీలో ఇన్వెస్ట్ చేస్తుంది. అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. షెడ్యూల్డ్ క్యాస్ట్, బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారికి ఈ స్కీమ్ ద్వారా అధిక ప్రయోజనం కలుగుతుంది. ఈ స్కీమ్ బెనిఫిట్ పొందాలంటే కచ్చితంగా హరియాణలో పుట్టిన వాళ్ళు అయ్యి ఉండాలి..
అక్కడ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు చాలా తక్కువ ఉన్నారు..wcdhry.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈ పథకంలో చేరొచ్చు. ఏబీహెచ్‌బీ అనే ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా అప్లై చేసుకోవాలి. ఈ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఫామ్ డౌన్ లోడ్ అవుతుంది. దీన్ని ఫిల్ చేసి దగ్గరిలోని అంగన్‌వాడీ సెంటర్‌లో ఇవ్వాలి. బర్త్ సర్టిఫికెట్, వ్యాక్సినేషన్ కార్డు, తల్లిదండ్రుల ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్, రెసిడెన్సీ సర్టిఫికెట్, బీపీఎల్ రేషన్ కార్డు వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. వీటిని కూడా అప్లికేషన్ ఫామ్‌తో జత చేసి పెట్టాలి.. ఆడ పిల్లకు ఇది సాయ పడుతుంది..