Fuel Sales: భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ వినియోగం.. గ్యాస్‌ది అదే దారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు.. వివిధ వస్తువల ధరలు, వంటనూనె ధరలు భారీగా పెరిగిపోతున్నాయి.. అన్నింటి పెరుగుదలపై పెట్రో ధరల ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నమాట… పెట్రో ధరలు పైకి ఎగబాకడంతో.. రవాణా ఛార్జీలు పెరిగి.. దాని ప్రభావం అన్నింటిపై పడుతుందని వెల్లడిస్తున్నారు.. అయితే, ఈ నెలలో ఇంధన వినియోగం బాగా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగడమే ఇందుకు కారణంగా విశ్లేషిస్తున్నారు.. మార్చి 2022 తొలి 16 రోజులతో పోల్చితే.. ఏప్రిల్ (ఈ నెల)లో అదే సమయంలో.. 10 శాతం పెట్రోల్ వినియోగం తగ్గిపోయింది.. ఇదే సమయంలో డీజిల్ వినియోగం 15.6 శాతం పడిపోగా.. వంటగ్యాస్ వినియోగం కూడా 1.7 శాతం డ్రాప్ అయ్యింది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో వంట గ్యాస్ వినియోగం బాగా పెరిగిపోయింది.. ఈ మధ్య వంటగ్యాస్‌పై వడ్డన పెరగడంతో.. దానికి కూడా డిమాండ్ తగ్గిపోయింది.. ఏప్రిల్ 1 నుండి 15 వరకు ప్రాథమికంగా, ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థల పెట్రోలు అమ్మకాలు 1.12 మిలియన్ టన్నులుగా ఉన్నాయి.. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 12.1 శాతం అధికం, అలాగే 2019 కాలంతో పోలిస్తే 19.6 శాతం ఎక్కువ.. అయితే, మార్చి 2022 మొదటి పదిహేను రోజుల్లో నమోదైన 1.24 మిలియన్ టన్నుల అమ్మకాలతో పోలిస్తే పెట్రోల్ వినియోగం 9.7 శాతం తగ్గింది. ఇక, దేశంలో అత్యధికంగా ఉపయోగించే ఇంధనం డీజిల్ ఏప్రిల్ మొదటి అర్ధ భాగంలో 7.4 శాతం అమ్మకాలను నమోదు చేసి సుమారు 3 మిలియన్ టన్నులకు చేరుకుంది, ఇది కూడా 2019లో ఇదే కాలం కంటే 4.8 శాతం ఎక్కువ. అయితే, ఈ ఇంధన వినియోగం మార్చి 1-15 మధ్య లాగిన్ అయిన 3.53 మిలియన్ టన్నుల వినియోగంతో పోలిస్తే 15.6 శాతం పడిపోయింది.. దీనికి ప్రధాన కారణం.. ధరల పెరుగుదలగా విశ్లేషిస్తున్నారు ఆర్థిక నిపుణులు.
తాజావార్తలు
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!