ఎప్పుడూ తమ కస్టమర్లను సంతృప్తి పరచడానికి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. అయితే తాజాగా మరో ఆఫర్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. స్మార్ట్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్ ఆకర్షణీయమైన తగ్గింపులను ప్రకటించింది. వీయూ ప్రీమియం 80 సెంటీమీటర్ల(Vu Premium TV 80 cm (32 inch) HD Ready LED Smart TV) టీవీపై భారీ ఆఫర్లు అందుబాటులో తీసుకువచ్చింది ఫ్లిఫ్‌కార్ట్.
వీయూ ప్రీమియం టీవీ 80 సెం.మీ (32 అంగుళాల) హెచ్ రెడీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ లాంఛింగ్ ధర రూ. 20,000. అయితే ఈ టీవీపై 37 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. దీంతో ఈ టీవీని రూ. 12,499కే సొంతం చేసుకోవచ్చు. మీరు ఈ టీవీని కొనుగోలు చేసేటప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే, మీకు 10 శాతం తగ్గింపు అంటే వెయ్యి రూపాయల అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ టీవీని రూ.11,499కే కొనుగోలు మీ సొంతమవుతుంది.
ఇంకా మీరు వీయూ ప్రీమియం టీవీ 80 సెం.మీ (32 అంగుళాల) హెచ్ రెడీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందుకోవచ్చు. మీ పాత స్మార్ట్ టీవీకి బదులుగా ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయడం ద్వారా, మీరు 11 వేల రూపాయల వరకు ఎక్సేంజ్ ఆఫర్ అందుకోవచ్చు. మీ పాత టీవీ మోడల్, కండిషన్ పై మీకు లభించే ఎక్సేంజ్ ఆఫర్ ఆధారపడి ఉంటుంది.
ఈ ఆఫర్ మీకు పూర్తిగా అప్లై అయితే.. మీరు కేవలం రూ.499కే ఈ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ రెండు స్పీకర్లు మరియు 20W సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తుంది. 32-అంగుళాల డిస్‌ప్లే, 1,366 x 768 పిక్సెల్‌ల హెచ్‌డీ రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మీరు నెబ్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లతో పాటు య్యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను లాంటి ఎన్నో ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.