Rules Changed: సామాన్యులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మో ఒకటో తారీఖు.. ఇది సినిమా పేరు కాదండి. నిజంగానే ఒకటో తారీఖు వచ్చిందంటే సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. అలా శాలరీ క్రెడిట్ కాగానే ఇలా డబ్బులన్నీ అయిపోతాయి. ఉద్యోగులకే కాదు సామాన్యులందరికీ ఒకటో తారీఖు అంటే ఓ రకమైన ఫీలింగ్. అయితే అక్టోబర్ 1వ తేదీ సామాన్యుల జీవితాల్లో మరింత పెనుభారం కాబోతోంది. ఎందుకంటే అక్టోబర్ 1 నుంచి పలు నిబంధనలు మారనున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సిస్టమ్‌లో నిబంధనలు, ఎల్పీజీ గ్యాస్ రేట్లు వంటి అనేక అంశాలు మారనున్నాయి.
ఈఎంఐ ధరలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ సమీక్ష సమావేశం ఈనెలాఖరులో జరగనుంది. సెప్టెంబర్ 30న జరిగే ఈ సమావేశంలో ఆర్బీఐ వడ్డీరేట్లను ప్రకటించనుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ రెపో వడ్డీ రేటును పెంచే అవకాశం ఉంది. దీంతో అక్టోబర్ 1 నుంచి లోన్లపై ఈఎంఐల భారం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
గ్యాస్ ధరలు
అటు ప్రతినెల ఒకటో తేదీ ఎల్పీజీ గ్యాస్ రేట్లు పెరగడం లేదా తగ్గడం జరుగుతున్నాయి. అయితే రూపాయి పతనం అయిన నేపథ్యంలో అక్టోబర్ 1న మరోసారి గ్యాస్ ధరలు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అటల్ పెన్షన్ యోజన
అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టేవారు రూ. 5వేల వరకు నెలవారీ పెన్షన్ పొందుతారు. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా ఈ ప్రభుత్వ పథకాన్ని పొందవచ్చు. కానీ అక్టోబర్ 1 నుంచి ఈ ప్లాన్‌లో మార్పు రానుంది. కొత్త నిబంధనల ప్రకారం ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకం ప్రయోజనం పొందరు. మీరు పన్ను చెల్లింపుదారులైతే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి మీకు సెప్టెంబర్ 30 వరకే సమయం ఉంది.
కార్డు టోకనైజేషన్ నియమాలు
సైబర్ మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అక్టోబర్ నుంచి భారీ మార్పులను తీసుకురానుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వినియోగదారుల కోసం కార్డ్ ఆన్ ఫైల్ టోకనైజేషన్ నియమాలను ఆర్బీఐ అమలు చేస్తోంది. గతంలో ఈ నిబంధనను జనవరి 1, 2022 నుండి అమలు చేయాల్సి ఉంది. అయితే ఆర్బీఐ ఈ గడువును జూన్ 30 వరకు పొడిగించింది. ఆ తర్వాత అక్టోబర్ 1, 2022 నుంచి ఈ నిబంధనను అమలు చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
డీమ్యాట్ ఖాతా
షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడానికి డీమ్యాట్ ఖాతా అవసరం. దీని ద్వారా స్టాక్ మార్కెట్లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడతారు. కానీ ప్రస్తుతం డీమ్యాట్ ఖాతాదారులకు రెండు రకాల ప్రమాణీకరణ అవసరం. సెప్టెంబర్ 30లోగా మీ డీమ్యాట్ ఖాతాలో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆప్షన్ ఎనేబుల్ చేయాలి. లేకపోతే మీ డీమ్యాట్ ఖాతాను తెరవలేరు.
రెస్టారెంట్ యజమానులపై భారం
ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు గత ఏడాది అక్టోబర్ 1 నుండి నగదు రసీదులపై FSSAI లైసెన్స్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌ను పేర్కొనాలి. FSSAI ఆర్డర్ ప్రకారం, లైసెన్సింగ్, రిజిస్ట్రేషన్ అధికారులు ఈ పాలసీకి విస్తృత ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!