పేపర్ లేదా సంప్రదాయ కరెన్సీకి బదులుగా వచ్చిన క్రిప్టో కరెన్సీని తీసుకొచ్చారు. 2003 నుంచి క్రిప్టో కరెన్సీ వాడుకలో ఉన్నా,ఇటీవల కాలంలోనే దీని విలువ ప్రపంచానికి తెలిసింది. క్రిప్టో కరెన్సీలో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ, బిట్‌కాయిన్ అందరికీ సుపరిచితమైంది. ప్రముఖ మోటార్స్ కంపెనీ టెస్లా, కార్ల కొనుగోలుకు క్రిప్టో కరెన్సీని అనుమతించబోమని చెప్పడంతో బిట్‌కాయిన్ విలువ భారీగా పతనం అయింది. 75 వేల డాలర్ల నుంచి ఏకంగా 35వేల డాలర్లకు పడిపోయింది. ఏ దేశం కూడా ఈ క్రిప్టో కరెన్సీని అధికారిక కరెన్సీగా గుర్తించలేదు. ఇటీవలే ఎల్‌సాల్వేడార్ క్రిప్టో కరెన్సీని గుర్తించినప్పటికీ, ప్రపంచబ్యాంక్ సాంకేతికతను అందించేందుకు నిరాకరించింది. బ్లాక్ చెయిన్ సాంకేతికత ఆధారంగా ఈ కరెన్సీ చెలామణి అవుతుంది.
Read: ఇండియాలో రికార్డ్ స్థాయిలో వ్యాక్సినేషన్లు… ఒక్క రోజులో…
దీనిపై ప్రభుత్వాలకు నియంత్రణ ఉండదు. డిజిటల్ రూపంలో ఉంటుంది. పైగా ఈ కరెన్సీని మెయింటెయిన్ చేయడానికి మాములు కంప్యూటర్ వ్వవస్థ సరిపోదు. డిజిటల్ కరెన్సీకి అనుతులు ఇవ్వడం వలన విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఫలితంగా ఇప్పటికే పెరిగిపోతున్న కాలుష్యానికి ఇది మరింత అదనంగా కాలుష్యం తోడవుతుంది. వివిధ రకాల ఫజిల్స్ కు సమాధానాలు వెలికి తీయడం ద్వారా క్రిప్టో కరెన్సీని సొంతం చేసుకొవచ్చు. అయితే, ఈ పజిల్స్ ను సాల్వ్ చేయడం చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది. విద్యుత్ వినియోగం పెరుగుతుంది. దీంతో క్రిప్టో మైనింగ్ పై చైనాలో ఉక్కుపాదం మోపడంతో క్రిప్టో కరెన్సీ పతనం అవుతూ వచ్చింది.