ఇండియాలో రికార్డ్ స్థాయిలో వ్యాక్సినేష‌న్లు… ఒక్క రోజులో…

క‌రోనాపై ఇండియా పోరాటం చేస్తున్న‌ది. క‌రోనాకు చెక్ పెట్టాలి అంటే వ్యాక్సిన్ ఇవ్వ‌డం ఒక్క‌టే మార్గం కావ‌డంతో వ్యాక్సినేష‌న్‌ను వేగంగా అమ‌లు చేస్తున్న‌ది.  ప్ర‌స్తుతం దేశంలో మూడు ర‌కాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.  కోవీషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల‌ను కేంద్రం కొనుగోలు చేసి రాష్ట్రాల‌కు అందిస్తున్న‌ది.  జూన్ 21 వ తేదీ నుంచి కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.  

Read: తమిళనాడులో బయటపడ్డ పురాతన వేంకటేశ్వర స్వామి రాతి విగ్రహం

ఉచిత వ్యాక్సిన్ ప్ర‌క‌టించిన తొలిరోజు ఇండియాలో 80,95,314 మందికి వ్యాక్సిన్‌ల‌ను అందించారు.  ఒక‌రోజు ఈ స్థాయిలో వ్యాక్సిన్లు అందించ‌డం ఇదే ప్ర‌ధ‌మం. జ‌నాభా ప్రాతిప‌ధిక‌న కేంద్రం వ్యాక్సిన్ల‌ను రాష్ట్రాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది.  ప్ర‌తిరోజు ఈ స్థాయిలో వ్యాక్సిన్లు అందించ‌గ‌లిగితే వీలైనంత త్వ‌ర‌గా దేశంలోని 18 ఏళ్లు నిండిన అంద‌రికీ వ్యాక్సిన్ అందించ‌వ‌చ్చు. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-