ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డ్ లు తీసుకుంటున్నారు. ఏదో ఒక అవసరం కోసం.. తప్పనిసరి అప్పులు చేయడం కామన్ అయిపోయింది. అయితే.. కొందరు బయట వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకుంటూ ఉంటారు. మరికొందరు బ్యాంకులు ఇచ్చే రుణాలపై ఆధారపడుతుంటారు. ఎక్కువగా బిజినెస్ చేసేవాళ్లు.. ఉద్యోగాలు చేసేవాళ్లు .. క్రెడిట్ కార్డ్ ల నుంచి లోన్ తీసుకుంటారు. క్రెడిట్ కార్డుపై వచ్చే లోన్ తీసుకోవడం మంచిదేనా..? అని చాలా మంది.. సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Read Also:Woman Cooking Train: రైలులో మ్యాగీ వండిన మహిళ.. వీడియో వైరల్..
ఉద్యోగులు, వ్యాపారులే కాకుండా.. తమ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా క్రెడిట్ కార్ట్ తీసుకుంటున్నారు. అయితే.. అత్యవసర సమయాల్లో క్రెడిట్ కార్డు ద్వారా లోన్లు తీసుకుంటున్నారు. వీటితో పాటు ఆఫర్లు, డిస్కౌంట్స్ లాంటి అనేక బెనిఫిట్స్ ఉండటంతో.. ఎక్కువ శాతం క్రెడిట్ కార్డ్ లు తీసుకుంటున్నారు. బ్యాంకులు కూడా పోటీ పడి కస్టమర్లకు క్రెడిట్ కార్డులు ఇస్తుండడం విశేషం..
Read Also:AI Image Detection: Google నుంచి క్రేజీ ఫీచర్.. ఫోటోల రహస్యాలు ఒకే క్లిక్‌తో బయటకు
అయితే.. క్రెడిట్ కార్డులపై వచ్చే లోన్ కావాలనుకుంటే చాలా సులువుగా ఉంటుంది. అప్లై చేయగానే వెంటనే డబ్బలు మన ఖాతాలో పడిపోతాయి. మన క్రెడిట్ కార్డ్ లిమిట్ ను చూసి బ్యాంకులు మనకు.. ఎంత లోన్ ఇవ్వాలనే విషయాన్ని డిక్లేర్డ్ చేస్తాయి. అయితే క్రెడిట్ కార్డులపై ఎక్కువ వడ్డీ ఉంటుంది. అంతేకాకుండా ప్రాసెసింగ్ ఫీజు కూడా వసూలు చేస్తుంటారు. వీటిపై లోన్లు తీసుకుని కట్టకపోతే.. సిబిల్ స్కోర్ తగ్గిపోవడమే కాకుండా.. ఫ్యూచర్ లోన్లు రావడం కూడా కష్టం అవుతుంది. అయితే మేము ఈ విషయాన్ని ఇంటర్నెట్ గ్రహించాం.. కాబట్టి క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకోవాలనుకోవడం.. వద్దనుకోవడం మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఇంకా ఏమైనా.. సందేహాలు ఉంటే.. మీ దగ్గరల్లోని ఆర్థిక నిపుణులను సంప్రదించి సలహా తీసుకోగలరు..