ఈరోజుల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే ఎన్నో బిజినెస్లు ఉన్నాయి.. సొంతంగా బిజినెస్ చేసి డబ్బులను సంపాదించాలని అనుకొనేవారికి ఎన్నో బిజినెస్ లు అందుబాటులో ఉన్నాయి..మీరు కూడా ఈ జాబితాలో ఉంటే మేము అందించే ఈ బిజినెస్ ఐడియాను ఒక్కసారి చూడండి.. ఈ బిజినెస్ తో తక్కువ ఖర్చుతో విపరీతమైన లాభాలను ఆర్జించవచ్చు. అటువంటి వ్యాపార ఆలోచనను మీకు తెలియజేస్తున్నాం.. అదేంటంటే.. అరటికాయ పొడి వ్యాపారం.. ఈ వ్యాపారంలో ఎక్కువ ఖర్చు ఉండదు. రూ.10,000-రూ.15,000 రూపాయలతోనే అరటిపండు పొడి వ్యాపారం ప్రారంభించవచ్చు.
అయితే ఈ పొడిని తయారు చేయడానికి మీకు రెండు యంత్రాలు అవసరం అవుతాయి.. ఈ పొడిని తయారు చెయ్యడం కోసం మీరు ముందుగా పచ్చి అరటిపండ్లను సేకరించాలి.. ఈ అరటిని సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయాలి. ఇప్పుడు వాటిని పీల్ చేసి వెంటనే సిట్రిక్ యాసిడ్ ద్రావణంలో వేసి 5 నిమిషాలు అలాగే ఉంచాల్సి ఉంటుది. దీని తర్వాత అరటిపండును చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఓవెన్‌లో ముక్కలను ఉంచండి. 60° C వద్ద దానికి 24 గంటలు ఉంచండి. దీంతో అరటిపండు ముక్కలు పూర్తిగా ఆరిపోతాయి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా పొడిగా వచ్చేవరకు గ్రైండ్ చేసుకోవాలి..
ఈ పొడి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. ఇది బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణ శక్తిని బలోపేతం చేయడానికి కూడా ఉపయోగించబడుతుంది. అంతే కాకుండా, ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఈ లక్షణాల కారణంగా, అరటి పొడికి మార్కెట్‌లో డిమాండ్ ఉంది.. ఈ బిజినెస్ ను చెయ్యడానికి ఖర్చు దాదాపు 10-15 వేల రూపాయల వరకు వస్తుంది. కానీ సంపాదన మాత్రం మంచిగా ఉంటుంది. అరటిపండుతో తయారుచేసిన పొడిని పాలిథిన్ లేదా గాజు సీసాలో నింపి ఉంచుకోవచ్చు. అరటిపండుతో తయారు చేసిన 1 కిలోల పొడిని మార్కెట్‌లో రూ.800 నుంచి రూ.1000 వరకు సులభంగా విక్రయించవచ్చు.. మీరు చేసుకునేదాన్ని బట్టి మీకు ఆదాయం ఉంటుంది.. మీకు బిజినెస్ ఆలోచన ఉంటే ట్రై చెయ్యండి..