మహిళల కోసం కొన్ని బ్యాంకులు ప్రత్యేకమైన ఆఫర్స్ ను అందిస్తున్నారు.. తాజాగా మరో బ్యాంక్ మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా తీపికబురు అందించింది. అదిరే ప్రకటన చేసింది..మహిళల కోసం స్పెషల్ స్కీమ్‌ను అందుబాటులో ఉంచింది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బ్యాంక్ వెల్లడించింది. అందువల్ల ఈ స్కీమ్‌లో చేరాలని భావించే వారు ఇప్పుడు బ్యాంక్‌కు వెళ్లి సులభంగానే చేరొచ్చు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌ను అందిస్తున్న మూడో బ్యాంక్ ఇది. ఇప్పటికే కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది….
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనేది డిపాజిట్ స్కీమ్. దీని టెన్యూర్ రెండేళ్లు. ఈ స్కీమ్‌ల చేరితే 7.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ పథకం కొంత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2025 మార్చి 31 వరకే ఈ స్కీమ్‌లో చేరడానికి అవకాశం ఉంటుంది. మహిళలకు మాత్రమే ఈ స్కీమ్‌లో చేరడానికి అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల పేరుపై కూడా ఈ పథకంలో చేరొచ్చు. అయితే వీరికి గార్డియన్ గా ఒక మహిళ ఉండాలి. ఈ స్కీమ్ ద్వారా రెండు లక్షల డబ్బులను దాచుకోవచ్చు..ఒకేసారి రూ.2 లక్షల మొత్తాన్ని డిపాజిట్ చేయొచ్చు. లేదంటే చిన్న చిన్న మొత్తంలో కూడా డబ్బులు దాచుకోవచ్చు. గరిష్టంగా రూ. 2 లక్షల వరకు డిపాజిట్ చేసే ఛాన్స్ ఉంటుంది.
ఉదాహరణకు మీరు రూ. 20 వేల చొపున పది సార్లు ఈ స్కీమ్‌లో డబ్బులు దాచుకోవచ్చు. అయితే ఒకసారి డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత మూడు నెలల వరకు వేచి ఉండాలి.. ఇకపోతే మూడునెలలకు ఒకసారి వడ్డీని చెల్లిస్తారు..మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్‌లోనే వడ్డీ డబ్బులు జమ అవుతాయి. మెచ్యూరిటీ సమయంలో ఒకేసరి తీసుకోవచ్చు. స్కీమ్‌లో చేరితన ఏడాది తర్వాత 40 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేకోవచ్చు. స్కీమ్‌లో చేరిన ఆరు నెలల తర్వాత పథకం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలని భావిస్తే.. అప్పుడు వారికి 5.5 శాతం వడ్డీ తో లభిస్తుంది.. ఈ స్కీమ్ ప్రతి బ్యాంక్ లో అందుబాటులో ఉంది..