ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ అయినటువంటి ఇండియన్ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది..ఇండియన్ బ్యాంక్ తాజాగా స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇండ్ సూపర్ 400 డేస్ డిపాజిట్ స్కీమ్ మరి కొంత కాలం కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా బ్యాంక్ మరో కొత్త ఎఫ్‌డీ స్కీమ్ కూడా తీసుకువచ్చింది. 300 రోజుల టెన్యూర్‌తో ఈ కొత్త పథకాన్ని లాంచ్ చేసింది. అంటే ఒకేసారి బ్యాంక్ కస్టమర్లకు రెండు శుభవార్తలు తీసుకువచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయాల వల్ల ప్రధానంగా బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పవచ్చు..
ఇకపోతే ఈ బ్యాంక్ 7 రోజుల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో ఫిక్స్‌డ్ డిపాజిట్ సర్వీసులు అందిస్తోంది. వీటిపై 2.8 శాతం నుంచి 6.7 శాతం వరకు వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. ఇండ్ సూపర్ ఎఫ్‌డీ స్కీమ్ విషయానికి వస్తే.. ఇది స్పెషల్ రిటైల్ టర్మ్ డిపాజిట్ ప్రొడక్ట్. దీని టెన్యూర్ 400 రోజులు. ఈ స్కీమ్ 2023 మార్చి 6 నుంచి అందుబాటులోకి వచ్చింది. కనీసం రూ. 10 వేల నుంచి డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రూ. 2 కోట్ల వరకు డబ్బులు దాచుకోవచ్చు. ఈ స్కీమ్ గడువను బ్యాంక్ ఆగస్ట్ 30 వరకుపొడిగించినట్లు పేర్కొంది..
ఈ 400 రోజుల ఎఫ్‌డీ స్కీమ్‌పై బ్యాంక్ 7.25 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. అదే సీనియర్ సిటిజన్స్ అయితే ఈ వడ్డీ రేటు 7.75 శాతంగా ఉంటుంది. ఇక సూపర్ సీనియర్ సిటిజన్స్ అయితే ఏకంగా 8 శాతం వడ్డీ రేటు పొందొచ్చు. అలాగే బ్యాంక్ ఇండ్ సుప్రీమ్ 300 డేస్ ఎఫ్‌డీ స్కీమ్ కూడా తెచ్చింది. ఈ స్కీమ్ జూలై 1 నుంచి అమలవుతు వచ్చింది. ఇందులో కనీసం రూ. 5 వేల నుంచి డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రూ.2 కోట్ల వరకు డబ్బులు దాచుకోవచ్చు. ఈ స్కీమ్ గడువు ఆగస్ట్ 31 వరకే ఉంటుంది..ఇందులో 7.05 వడ్డీ లభిస్తుంది.. అలాగే సీనియర్స్ అయితే 7.55 శాతం వడ్డీ లభిస్తుంది.. గతంలో కూడా ఈ బ్యాంకు ఎన్నో బెనిఫిట్స్ ను అందించింది.. ఇప్పుడు ఈ బెనిఫిట్స్ తో జనాలు బ్యాంక్ కస్టమర్లు పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది..