Balochistan: బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) పాకిస్తాన్, ఆ దేశ ఆర్మీకి చుక్కులు చూపిస్తోంది. బలూచిస్తాన్‌లో పనిచేసేందుకు పాక్ ఆర్మీ వణికిపోతోంది. తాజాగా , బలూచ్ యోధులు 5 మంది పాక్ సైనికుల్ని హతమార్చినట్లు బీఎల్ఏ ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే, బలూచిస్తాన్ అమెరికన్ కాంగ్రెస్ సెక్రటరీ జనరల్ రజాక్ బలూచ్ కెనడాకు చెందిన మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. బలూచిస్తాన్ లోని దాదాపు 70-80 శాతం ప్రాంతంపై పాకిస్తాన్ సైన్యానికి పట్టులేదని చెప్పారు.
Read Also: Chada Venkat Reddy: ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను కేంద్ర ప్రభుత్వం అంతం చేస్తుంది..
బీఎల్ఏ పాకిస్తాన్ సైన్యంపై ఆపరేషన్ హెరోఫ్ ప్రారంభించింది. ‘‘సాయంత్రం 5 నుంచి ఉదయం 5 గంటల వరకు పాక్ సైన్యం భయంతో రోడ్లను ఖాళీగా ఉంచుతోంది. పాకిస్తాన్ నేతలు కూడా రాత్రిపూట క్వెట్టా లోపల సైన్యం స్వేచ్ఛగా పనిచేయకపోవడాన్ని అంగీకరించారు. బలూచిస్తాన్ అంతటా సామూహిక నిరసనలు కొనసాగుతున్నాయి. సీనియల్ బలూచ్ కార్యకర్త మారంగ్ బలూచ్ అరెస్ట్ జరిగింది. చౌహ్ని, క్వెట్టా వంటి పట్టణ ప్రాంతాల్లో పాక్ ఆధిపత్యాన్ని కూల్చేందుకు అంతర్జాతీయ జోక్యం, ముఖ్యంగా భారత్, అమెరికా జోక్యం చేసుకోవాలి’’ అని రజాక్ విజ్ఞప్తి చేశారు.
పాకిస్తాన్ బంగ్లాదేశ్‌లో లాగా లొంగిపోకముందే, వెనక్కి తగ్గడం మంచిదని ఆయన హెచ్చరించారు. భారత్ బలూచ్ స్వేచ్ఛా లక్ష్యానికి మద్దతు ఇస్తే బలూచిస్తాన్ తలుపులు భారత్‌కి తెరుచుకుంటాయి అని ఆయన అన్నారు. అలాగే, పాక్ సైనికులు, రాజకీయ నాయకలు రాజధాని క్వెట్టా నుంచి బయటకు వచ్చి చూపించాలని సవాల్ విసిరారు. బీఎల్ఏ ప్రతినిధి జీయంద్ బలోచ్ ప్రకారం, పాక్ సైన్యానికి వ్యతిరేకంగా ప్రారంభించిన ఆపరేషన్‌లో ఇప్పటి వరకు 130 మంది సైనికుల్ని హతమార్చినట్లు చెప్పారు.
56 Pakistani Army men HOORIFIED by Balochistan Liberation Army 😆 pic.twitter.com/syX7ycfNtE
— Sunanda Roy 👑 (@SaffronSunanda) May 16, 2025