భారత ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఇండియా టాటా చేతుల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా సంస్థకు అప్పులు పెరిగిపోవడంతో ప్రైవేటీకరణ వైపు మొగ్గుచూపడంతో ఎయిర్ ఇండియాను టాటా సన్స్ దక్కించుకుంది. గతేడాది నిర్వహించిన బిడ్డింగ్‌లలో టాటాలు ఎయిర్ ఇండియాను చేజిక్కించుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక బదలాయింపులు దాదాపు పూర్తయ్యాయి. జనవరి 27 న ఎయిర్ ఇండియాను పూర్తిగా టాటాలకు అప్పగించబోతున్నారు. ఇప్పటికే విస్తారా, ఎయిర్ ఏషియాలో టాటాలకు భారీ వాటాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా రాకతో టాటా చేతిలో మూడో విమానయాన సంస్థ వచ్చి చేరినట్టు అయింది.
Read: ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా టీమిండియా మహిళా క్రికెటర్
ఎయిర్ ఇండియాతో పాటు ప్రధాన విమానాశ్రయాల్లో కార్గో సేవలు అందిస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో 100శాతం వాటా టాటాకు దక్కింది. అయితే, ఎయిర్ ఎషియాలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను విలీనం చేయాలని టాటా సంస్థ ఆలోచిస్తున్నది. 1932లో టాటాలు ప్రారంభించిన టాటా ఎయిర్‌లైన్స్ ఏళ్ల తరువాత తిరిగి మళ్లీ టాటాల చేతికి దక్కడం విశేషం.