Accenture: ప్రమోషన్ కావాలంటే AI వాడాలి.. ఉద్యోగులకు యాక్సెంచర్ వార్నింగ్..

  • ఏఐ వాడితేనే ప్రమోషన్స్..
  • ఉద్యోగులకు తేల్చి చెప్పిన యాక్సెంచర్..
Accenture

Accenture

Accenture: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) వచ్చిన తర్వాత, టెక్ రంగంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీవితాలు దినదిన గండం నూరేళ్ల ఆయుషుగా మారింది. ఎప్పుడు ఉద్యోగాలు పోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. టెక్ కంపెనీలు కూడా ఉద్యోగులు అంతా AIకి అలవాటుపడాలని చెబుతున్నాయి.

ప్రముఖ టెక్ దిగ్గజం యాక్సెంచర్ 11,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఇప్పుడు మరో సంచలనం నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఉద్యోగులు ఏఐ వాడకపోతే ప్రమోషన్లు ఉండవని స్పష్టం చేసింది. ఏఐ వాడని ఉద్యోగుల జాబ్‌లు రిస్క్‌లో పడుతాయని చెప్పకనే చెప్పింది. అసోసియేట్ డైరెక్టర్లు, సీనియర్ మేనేజర్లకు ఈమెయిల్ ద్వారా యాక్సెంచర్ ఈ విషయాన్ని తెలిపింది. లీడర్‌షిప్ రోల్స్‌కు వెళ్లాలంటే ఏఐ టూల్స్ రెగ్యులర్‌గా వాడటం తప్పనిసరి అని చెప్పింది.

Read Also: Jonathan Trott: “ప్లేయర్స్ బాగా ఎదిగారు”.. అఫ్గాన్ టీమ్‌తో విడిపోతూ కన్నీళ్లు పెట్టుకున్న కోచ్..

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో యాక్సెంచర్ సీఈఓ జూలీ స్విట్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీలు తమ ప్రాసెస్‌లు, పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చాలి. ఏఐ ఆధారంగా కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్‌ను నిర్మించుకోవాలని సూచించారు. ఒక్క యాక్సెంచర్‌ మాత్రమే కాదు, ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాయి. ఏఐ వాడటం ఒక ఆప్షన్ కాదని ఉద్యోగుల్ని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ఏఐపై నమ్మకం లేకపోతే కంపెనీ వదిలేయాలని సీఈఓ సత్యా నాదెళ్ల గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం. మెటా కూడా ఉద్యోగుల ఏఐ వాడకాన్ని ట్రాక్ చేస్తుంది. ఏఐ వాడకుంటే వెనకబడిపోతారని గూగుల్ చెబుతోంది.