Haval H9 SUV Gift: ఆసియా కప్ ఆసాంతం తన సంచలన బ్యాటింగ్‌తో టీం ఇండియాకు పెట్టని కోటలా నిలిచిన యువ కెరటం అభిషేక్ శర్మ. మనోడు ఆసియా కప్ ఫైనల్ మినహా టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడి జట్టు విజయాల్లో కీ రోల్ ప్లే చేశాడు. టోర్నీలో భారత్ కప్పు కొట్టడంతో పాటు, అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డు వరించింది. అభిషేక్ 7 మ్యాచుల్లో 314 పరుగులు చేసి టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దానికింద మనోడికి గిఫ్ట్‌గా ‘హవల్ హెచ్ 9’ కారు దక్కింది. మీకు తెలుసా ఈ కారు ఎన్ని లక్షల్లో రూ.33 లక్షలు. ఇంతకీ ఈ కారు విశేషాలు తెలుసా..?
READ ALSO: Kalvakuntla Kavitha : మరోసారి కవిత హాట్ కామెంట్స్.. కొందరిలో స్వార్థం ప్రవేశించిందంటూ
చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్ (GWM) హవల్ బ్రాండ్ కారును రూపొందించింది. ఇది ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా తట్టుకొనేలా అధునాతన సాంకేతికతతో తయారు చేయబడింది. ఈ ఎస్‌యూవీ (HAVAL H9 SUV)లో 2.0 లీటర్ టర్బోఛార్జ్‌డ్ 4 సిలిండర్ గ్యాసోలిన్ ఇంజిన్ ఉంటుంది. ప్రయాణికుల భద్రతకు సంబంధించిన ప్రత్యేకమైన ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ అవి ఏంటో తెలుసా..
* అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ద్వారా ట్రాఫిక్ కండీషన్‌ను బట్టి వేగం సర్దుబాటు అవుతుంది.
* 360 డిగ్రీస్ వ్యూ కెమెరాతో పాటు ఆటో, ఎకో, స్పోర్ట్, సాండ్, స్నో, మడ్ వంటి డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి.
* ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ సౌకర్యంతో పాటు బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ సదుపాయం కూడా ఉంది.
* అలాగే 14.6 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, 10-స్పీకర్ సౌండ్ సిస్టమ్ సౌలభ్యం ఉంది.
* పలు నివేదికల ప్రకారం.. ఈ కారు ధర మన కరెన్సీలో రూ.33,60,658గా ఉంది.
* ఇందులో కూలింగ్ కోసం సీట్ వెంటిలేషన్, రిఫ్రెష్ డ్రైవింగ్ కోసం మసాజ్ ఫీచర్ కూడా ఉన్నాయి.
READ ALSO: PIB Fact Check: నిరుద్యోగులకు మోడీ కానుక..?