2025 సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. ఈ ఏడాదిలో జరిగించాల్సిన పనులు, కార్యక్రమాలు అందరికీ ఉంటాయి. ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. సహజంగా కొత్త ఏడాదిలోకి ప్రవేశించినప్పుడు ఉద్యోగులు గానీ.. ఆయా వర్గాల ప్రజలు హాలీడేస్ చెక్ చేసుకుంటారు. ఈ నెలలో సెలవులు వచ్చాయని చూసుకుంటారు. స్టూడెంట్స్ అయితే పండుగ సెలవులు ఎప్పుడొచ్చాయని చూసుకుంటారు. ఇక బిజినెస్‌మేన్లు అయితే బ్యాంక్ హాలీడేస్ గానీ.. స్టాక్ మార్కెట్ సెలవులు చూసుకుంటారు. అయితే ఈ ఏడాది ఎప్పుడెప్పుడు సెలవులు వచ్చాయో ఒకసారి చూసేద్దాం.
2025లో బ్యాంక్ సెలవులు ఇవే..
జనవరి 14 (మంగళవారం) – మకర సంక్రాంతి
ఫిబ్రవరి 26 (బుధవారం) – మహా శివరాత్రి
మార్చి 14 (శుక్రవారం) – హోలీ
మార్చి 31 (సోమవారం)- రంజాన్
ఏప్రిల్ 05 (శనివారం)- జగ్జీవన్‌రాం జయంతి
ఏప్రిల్ 14 (సోమవారం) – అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 18 (శుక్రవారం) – గుడ్‌ఫ్రైడే
మే 01 (గురువారం) – మే డే
జూన్ 7 (శనివారం) – బక్రీద్
ఆగస్టు 15 (శుక్రవారం) – స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 16 (శనివారం) – శ్రీ కృష్ణాష్టమి
ఆగస్టు 27 (బుధవారం) – వినాయక చవితి
సెప్టెంబర్ 5 (శుక్రవారం) – మిలాద్- ఉన్- నబి
అక్టోబర్ 2 (గురువారం) – గాంధీ జయంతి
అక్టోబర్ 20 (సోమవారం) – దీపావళి
నవంబర్ 5 (బుధవారం) – గురునానక్ జయంతి
డిసెంబర్ 25 (గురువారం) – క్రిస్మస్
ఇక ప్రతి నెలా రెండో, నాలుుగో శనివారాలు, ఆదివారాలు బ్యాంకులు పనిచేయవు. అలాగే పండగలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో కూడా బ్యాంకులు తెరిచి ఉండవు.
దేశీయ స్టాక్ మార్కెట్
ఫిబ్రవరి 26 (బుధవారం) – మహాశివరాత్రి
మార్చి 14 (శుక్రవారం) – హోలీ
మార్చి 31 (సోమవారం) – రంజాన్
ఏప్రిల్ 10 (గురువరాం) – శ్రీ మహవీర్ జయంతి
ఏప్రిల్ 14 (సోమవారం) – అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 18 (శుక్రవారం) – గుడ్ ఫ్రైడే
మే 01 (గురువారం) – మహారాష్ట్ర డే
ఆగస్టు 15 (శుక్రవారం) – స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 27 (బుధవారం) – వినాయక చవితి
అక్టోబర్ 02 (గురువారం) – గాంధీ జయంతి
అక్టోబర్ 21 (మంగళవారం) – దీపావళి లక్షీపూజ
అక్టోబర్ 22 (బుధవారం) – దీపావళి
నవంబర్ 05 (బుధవారం) – గురునానక్ జయంతి
డిసెంబర్ 25 (గురువారం) – క్రిస్మస్
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం నుంచి శుక్రవారం వరకు పని చేస్తాయి. శని, ఆదివారాలు సెలవులుంటాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆరోజున కూడా స్టాక్ మార్కెట్ పని చేయనుంది. ఇప్పటికే స్టాక్ ఎక్స్ఛేంజీలు వెల్లడించాయి.