ఆర్థిక క్రమ శిక్షణ ఉన్నట్లైతే మీరు రిచ్ పర్సన్స్ గా మారొచ్చు. ఖర్చులను అదుపులో పెట్టుకుని పొదుపు మంత్రాన్ని పాటిస్తే సంపదను పెంచుకున్నట్లే అవుతుంది. ఈ రోజు మీరు చేసే తక్కువ మొత్తంలో పొదుపు రేపటి రోజున లక్షాధికారిని చేస్తుంది. పొదుపు చేయడమే కాదు.. దాన్ని భారీ లాభాలను అందించే పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. అయితే పెట్టుబడి ఎప్పుడు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వానికి చెందిన పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పోస్టాఫీస్ అందించే రికరింగ్ డిపాజిట్ ఒకటి. ఇందులో నెలకు రూ. 10 వేల పెట్టుబడితో మోచ్యూరిటి నాటికి రూ. 17 లక్షలు అందుకోవచ్చు.
మంచి రాబడి పొందేందుకు పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. ఈ పథకంలో కనీసం రూ. 100 డిపాజిట్ చేయొచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. మీరు పెట్టే పెట్టుబడిపై ఆధారపడి రాబడి ఉంటుంది. ఇందులో సింగిల్ అకౌంట్ కింద ఒకరు, జాయింట్ అకౌంట్ కింద గరిష్టంగా ముగ్గురు ఈ స్కీంలో చేరొచ్చు. మైనర్ పేరిట గార్డియెన్ ఖాతా తెరవొచ్చు. ఆర్డీ స్కీమ్ లో వడ్డీ రేటు ప్రస్తుతం 6.7 శాతంగా ఉంది. పథకం మెచ్యూరిటీ పిరియడ్ ఐదేళ్లు. మంచి రాబడి కోరుకునే వారు మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు.
ఈ పథకంలో రూ. 17 లక్షలు పొందాలంటే.. నెలకు రూ. 10 వేలు పొదుపు చేయాల్సి ఉంటుంది. ప్రతి నెల రూ.10 వేల పెట్టుబడితో సంవత్సరానికి రూ. 1,20,000 జమ అవుతుంది. ఐదేళ్లకు పెట్టుబడి మొత్తం రూ. 6 లక్షలు అవుతుంది. ప్రస్తుతమున్న వడ్డీ రేటు ప్రకారం వడ్డీ రూపంలో రూ 1,13,659 వస్తుంది. అప్పుడు అసలు వడ్డీ కలుపుకుని మెచ్యూరిటీ నాటికి రూ. 7,13,659 చేతికి అందుతుంది. మరో ఐదేళ్లు పొడిగిస్తే పెట్టుబడి రూ. 12 లక్షలు అవుతుంది. మెచ్యూరిటి నాటికి రూ.17,08,546 చేతికి అందుతాయి.