గిల్టీ బోర్డ్ తో సానుభూతి పొందిన సన్నీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ సీజన్ 5 పదకొండో వారం నామినేషన్స్ ఆసక్తికరంగా జరిగాయి. సన్నీ ప్రవర్తనతో విసిగి వేసారిన ఇంటి సభ్యులంతా అతన్ని టార్గెట్ చేయడంతో గిల్టీ అనే బోర్డును బిగ్ బాస్ చెప్పేవరకూ మెడలోనే ఉంచుకోవాలని నాగార్జున ఆదివారం సన్నీకి చెప్పాడు. నామినేషన్స్ ప్రక్రియ మొదలయ్యే వరకూ సన్నీ ఆ బోర్డ్ ను అలానే ధరించాడు. గతంలో ఇలానే షణ్ముఖ్ ను ఇంటి సభ్యులంతా టార్గెట్ చేసినప్పుడు అతని మీద ఎలా అయితే వ్యూవర్స్ కు సానుభూతి కలిగిందో ఇప్పుడు అలాంటిదే సన్నీ విషయంలో వ్యూవర్స్ కే కాదు, ఇంటి సభ్యులకూ కలిగినట్టు కనిపించింది. అది నామినేషన్స్ లో రిఫ్లెక్ట్ అయ్యింది కూడా! ఈ వారం సన్నీని రవి, శ్రీరామ్ మాత్రమే నామినేట్ చేశారు. అది కూడా అతని లూజ్ టంగ్ కారణంగానే! చిత్రం ఏమంటే సన్నీతో అంతలా వాదోపవాదాలు చేసిన సిరి, షణ్ముఖ్ అతన్ని నామినేట్ చేయలేదు. ఈ వారం ఒక్కోవ్యక్తి ఇద్దర్ని చొప్పున నామినేట్ చేయమని, కెప్టెన్ కాబట్టి రవిని ఎవరూ నామినేట్ చేయకూడదని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో ఆశ్చర్యకరంగా అత్యధికంగా కాజల్ ను నలుగురు (రవి, షణ్ముఖ్, సిరి, యానీ) నామినేట్ చేశారు. ఆ తర్వాత అత్యధికంగా ముగ్గురు (మానస్, కాజల్, ప్రియాంక) షణ్ముఖ్ ను నామినేట్ చేశారు. మానస్, సిరి, ప్రియాంక, సన్నీ, యానీ మాస్టర్లను ఇద్దరేసి సభ్యులు నామినేట్ చేశారు. శ్రీరామ్ ను కేవలం సన్నీ మాత్రమే నామినేట్ చేశాడు. అయినా హౌస్ లో ఉన్న కెప్టెన్ రవిని తప్ప బిగ్ బాస్ అందరినీ నామినేషన్స్ లో ఉంచేశాడు.
ఎప్పటిలానే నామినేషన్స్ సమయంలో ఇంటి సభ్యుల మధ్య ఈసారీ వాదోపవాదాలు జరిగాయి. మిగిలిన వారి కంటే కాజల్ అండ్ యానీ మధ్య, మానస్ మరియు యానీ మధ్య ఘాటైన చర్చ జరిగింది. అలానే సిరి, పింకీ కూడా ఒకరిని ఒకరు గట్టిగానే విమర్శించుకున్నారు. కానీ గతంలో మాదిరి ఈసారి ఈ వ్యవహారం హద్దులు మీరలేదు.
Also Read
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!