“బిగ్ బాస్-5” 5వ వారం విజయవంతంగా వీకెండ్ కు వచ్చేసింది. ఈ వారం అంతా ఫిజికల్ టాస్కులతో, సరికొత్త స్ట్రాటజిలతో గడిచిపోయింది. ప్రస్తుతం హౌజ్ లో అంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. దీంతో టాస్కుల్లో యుద్ధ రంగం కన్పించింది. ఇదిలా ఉండగా ఈసారి “బిగ్ బాస్-5” విన్నర్ ఎవరనే విషయంపై అప్పుడే చర్చ మొదలైపోయింది. లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయినా కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ “బిగ్ బాస్-5” విన్నర్ ఎవరనే విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
నటరాజ్ మాస్టర్ “బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” నుండి ఎలిమినేట్ అయిన మొట్టమొదటి మేల్ కంటెస్టెంట్. ఒక తెలుగు న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తాను ఎలిమినేట్ అవ్వడానికి దారి తీసిన వివిధ సంఘటనల గురించి నటరాజ్ వెల్లడించాడు. అతను నిజాయితీగా ఆడితే ప్రేక్షకులు తనకు ఓటు వేస్తారని తాను భావించానని, వారికి తన నిజస్వరూపం చూపించానని నటరాజ్ చెప్పాడు. “అయితే ఇంట్లో ట్రిక్స్, గ్రూప్ పాలిటిక్స్‌ని ప్లే చేస్తున్న పోటీదారులను మాత్రమే ప్రేక్షకులు నమ్మారు” అని నటరాజ్ అన్నారు. సిరి, జెస్సీ, షణ్ముఖ్ ఒక బ్యాచ్ లాగా ఆడుతున్నారని కూడా ఆయన ఆరోపించారు. గాయకుడు శ్రీ రామచంద్ర లేదా మానస్ “బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” విజేతగా నిలుస్తారని నటరాజ్ జోస్యం చెప్పారు.